Saturday, December 28, 2024

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలకు కృషి చేద్దాం

- Advertisement -
- Advertisement -

వనపర్తి : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పి ఓ ఎన్ ఐ సి సురేందర్ అన్నారు. ప్రభుత్వం ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన బాల్య వివాహాలు ,బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన గురించి సురేందర్ మాట్లాడుతూ పిల్లలను శ్రమ దోపిడి నుంచే కాకుండా ఇతర రక్షణలనూ కల్పిస్తున్నాయి. వయసుకు తగని ఆర్థిక కార్యకలాపాలు, వృత్తులో పని చేయకుండా భారత రాజ్యాంగం పిల్లలకు రక్షణ కల్పిస్తోందని 18 సంవత్సరాల్లో పు పిల్లలు ప్రమాదకర వృత్తులు చేపట్టడం నిషేద్ధం అని తెలిపారు.

బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిషేధించడానికి ముందుగా ప్రాథమిక విద్యను అందుబాటులోకి తేవాలని, అందుకే విద్యను ప్రాథమిక హక్కుగా చేయడం జరిగిందని చట్టం అమల్లో భాగంగా బడి బయట ఉన్న పిల్లలు, మధ్యలో మానేసిన పిల్లలను తిరిగి బడిలో చేర్పించడం సవాలుగా మారిందని, విద్యాహక్కు చట్టం హామీ ఇచ్చిన విధంగా వీరందరిని వాళ్ల వయసుకు తగిన తరగతిలో చేర్చించి విద్యనందించడం ఒక సవాలుగా మారిందన్నారు.

మధ్యలో బడిమానేయకుండా చూడటానికి ఎనిమిదో తరగతి వరకు పిల్లలకు డిటెన్షన్ పద్ధ్దతి ఉండకూడదని వీరిని సమగ్ర, నిరంతర, మూల్యాంకన పద్ధ్దతి ద్వారా పరీక్షించాలని విద్యాహక్కు చట్టం చెబుతోంది. నాణ్యమైన విద్యనందించడం ద్వారా ప్రతి ఒక్కరూ అవసరం మేరకు చదువు నేర్చుకొని, తర్వాత తరగతిలోకి ప్రవేశించగలిగేలా చేయాల్సిన బాధ్యత పాఠశాలపై ఉంటుందని చట్టంలో అన్నారు.. ఒక పూట బడి, ఏటా తప్సనిసరిగా బడి నడవాల్సిన రోజులు, రోజు బడి నడవాల్సిన సమయాన్ని చట్టం నిర్ధేశిస్తోంది.

విద్యా సంవత్సరంలో ఏ సమయంలో వచ్చినా తగిన తరగతిలో చేర్చుకోవాలి. అవసరమైన అదనపు శిక్షణ ఇవ్వాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ రాజేష్ కుమార్, చైల్డ్ హెల్ప్ లైన్ కౌన్సిలర్ రవి రాజ్, చైల్డ్ హెల్ప్ లైన్ కేస్ , వర్కర్ రాజు చెల్డ్ హెల్ప్ లైన్ కేస్ వర్కర్ అశోక్ కుమార్, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్ వైజర్ చంద్ర మోహన్, కళాశాల ఇంచార్జీ ప్రిన్సిపాల్ , కళాశాల అధ్యాపాకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News