Monday, December 23, 2024

కలసికట్టుగా పనిచేద్దాం…గులాబీ జెండా ఎగరేద్దాం

- Advertisement -
- Advertisement -

గోషామహల్: కలసి కట్టుగా పనిచేద్దాం…గోషామహల్‌లో గులాబీ జెండాను ఎగురవేద్దాం అని మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్ అ న్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి బేగంబజార్ కోల్సావాడీలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగా ణ రుచులు (పుట్ ఫెస్టివల్) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రేమ్‌సింగ్ రాథోడ్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యం లో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు విభేధాలను పక్కనపెట్టి, సమన్వయంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వం చేపడుతున్న అభివృ ద్ది కార్య క్రమాలు, సంక్షేమ పధకాల గురించి ప్రజల్లో విస్త్రతంగా ప్రచారం చేస్తూ పా ర్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమ నే త, గోషామ హల్ నియోజకవర్గం సీనియర్ బీఆర్‌ఎస్ నాయకులు ఆర్వీ మహేందర్ కుమార్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు, అభిమానులే బీఆర్‌ఎస్ పార్టీ బలం, బ లగం అన్నారు. రాబోయే ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగుర వేయడమే లక్షంగా బీఆర్‌ఎస్ కార్యకర్త లు యుద్దంలో సైని కుల్లా ఎన్నికల రణరంగంలో విజయమే లక్షంగా పని చేయాలని పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యే రాజాసింగ్‌ను నియోజకవర్గ ప్రజలు రెండుసార్లు గెలిపించి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినా, ఆయన నియోజకవర్గానికి చేసిన అభివృద్ది ఏమీ లేదన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వమే గోషామహ ల్ నియోజకవర్గంలో కో ట్లాది నిధులు వెచ్చించి అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకు ంటున్నారే తప్ప ఆయనకు గోషామహల్ నియోజకవర్గ అభివృద్ది, ప్రజల సంక్షేమం, సమస్యల పరిష్కారం పట్ల ఏమాత్రం చిత్తశుద్ది లేదని విమర్శించారు . ప్రజా సమస్యలు పట్టించుకోకుండా గోషామహల్ నియోజకవర్గాన్ని నిర్లక్షం చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్‌కు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చె ప్పేందుకు ప్రజలంతా సిద్దంగా ఉన్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అధిష్టానం ఉద్యమకారులకు పార్టీ టికెట్ కేటాయించి, న్యాయం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గం నుండి స్థానికులకు ఎవరికి పార్టీ టికెట్ ఇచ్చినా కలసి క ట్టుగా పనిచేసి, గోషామహల్‌లో గులా బీ జెండా ఎగరేస్తామన్నారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలకు తెలంగాణ రుచులతో కూడిన భోజ నాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్లు మమతా గుప్తా, పరమేశ్వరీసింగ్, మాజీ కార్పోరేటర్ ఎం రాంచందర్ రాజు, బీఆర్‌ఎస్ నా యకులు గడ్డం శ్రీనివాస్‌యాదవ్, ప్రేమ్‌కుమార్ ధూత్, సంతోష్ గుప్తా , శాంతిదేవి, శీలం సరస్వతి, బెజ్జిని శ్రీనివాస్, ఆల పురుషోత్తం, సురేష్ ముది రాజ్, రమేష్ గుప్తా, జి యాదగిరిలతో పాటు వివిధ డివిజన్‌ల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News