- Advertisement -
స్పెయిన్: ఇథియోపియాకు చెందిన లెటెసెన్‌బెట్ గైడీ ఆదివారం మహిళల హాఫ్ మారథాన్ ప్రపంచ రికార్డును బ్రేక్ చేసింది. వాలెన్సియా హాఫ్ మారథాన్ ట్రినిడాడ్ ఆల్ఫోన్సో ఇడిపిలో జరిగిన ఈ మారథాన్‌లో ఆమె 1గంట 22 నిమిషాల 52 సెకండ్లలో విన్నింగ్ పోస్ట్‌ను క్రాస్ చేసి రికార్డు సృష్టించింది. హాఫ్ మారథాన్ అనేది ఓ రోడ్డు రన్నింగ్ పోటీ ఈవెంట్. దాదాపు 21.0975 కిమీ. లేదా 13 మైళ్ల 192.5 అడుగులు పరుగెత్తాల్సి ఉంటుంది.
“నేను నా తొలి హాఫ్ మారథాన్ ప్రపంచ రికార్డును ఛేదించినందుకు ఆనందిస్తున్నాను. ఇది గ్రేసియాస్ వాలెన్సియాలోని ఎన్‌ఎన్ రన్నింగ్ టీమ్‌కు కూడా తొలి గెలుపు” అని గైడీ చెప్పింది. ఆమె టోక్యో ఓలింపిక్స్ 10000 మీటర్ల పందెంలో కాంస్య పతక విజేత.
- Advertisement -