Wednesday, January 22, 2025

ప్రభుత్వాసుపత్రుల్లోనూ బూస్టర్‌కు అనుమతి ఇవ్వండి

- Advertisement -
- Advertisement -

Letter from Medical Health Minister Harish Rao to Center

కేంద్రానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు లేఖ

భవిష్యత్‌లో కొత్త వేరియంట్ల ద్వారా కరోనా వ్యాపించే ప్రమాదం ఉన్నందున రెండు డోసులు పూర్తి అయిన వారికి ప్రికాషనరీ డోస్ ఇవ్వడానికి అవకాశం కల్పించాలి
15ఏళ్లు పైబడిన వారికి ఈ డోస్ ఇచ్చేందుకు ప్రైవేట్ ఆసుపత్రులకే అనుమతిచ్చారు
ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ, 1859 ఏళ్ల వారికిప్రికాషనరీడోస్‌కు అవకాశమివ్వాలి
రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి నిర్వహించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎంతో తోడ్పడింది

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ కొవిడ్ బూస్టర్ డోస్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్ రావు కేంద్రానికి లేఖ రాశారు. భవిష్యత్తులో కొత్త వేరియంట్ల ద్వారా కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉందనే అంచనాల నేపథ్యంలో, రెండు డోసులు పూర్తి చేసుకొని అర్హులైన వారికి ప్రికాషనరీ డోస్ ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మనుసుక్ మాండవీయకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ వైద్యంలో ప్రస్తుతం 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే ప్రికాషనరీ డోస్ ఇచ్చేందుకు అనుమతించిన కేంద్రం,18 ఏళ్లు పైబడిన వారికి ఈ నెల 10 నుంచి ప్రికాషనరీ డోస్ ఇచ్చేందుకు కేవలం ప్రైవేటు ఆసుపత్రులకే అనుమతించింది.

ఈ క్రమంలో ప్రైవేటుతో పాటు ప్రభుత్వ కేంద్రాల్లోనూ 18- నుంచి 59 ఏళ్ల వయస్సున్న వారికి ప్రికాషనరీ డోస్ ఇచ్చేందుకు అనుమతించాలని బుధవారం మంత్రి లేఖ రాశారు. ఆ దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఈ నెల 10 నాటికి దాదాపు 9,84,024 మంది ప్రికాషనరీ డోసు పొందేందుకు అర్హులుగా ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం 18 ఏళ్లు పైబడిన వారికి 106 శాతం మొదటి డోసును, 100 శాతం రెండో డోసును, 15 నుంచి -17 ఏళ్ల కేటగిరీలో మొదటి డోసును 90 శాతం, రెండో డోసును 73 శాతం, 12 నుంచి -14 ఏళ్ల వయస్సు వారికి 78 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో, వ్యాధి ప్రభావాన్ని తగ్గించడంలో విస్తృతంగా నిర్వహించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎంతో తోడ్పడిందని పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News