Monday, December 23, 2024

మీ మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నాం..

- Advertisement -
- Advertisement -

Letter posted by Warne Kids is stirring fans

కంటతడి పెట్టిస్తున్న వార్న్ పిల్లల భావోద్వేగ ట్విట్

సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ హఠాన్మరణం అతడి కుటుంబ సభ్యులనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను శోకసముద్రంలో ముంచెత్తిన విషయం తెలిసిందే. ప్రపంచ క్రికెట్‌పై తనదైన ముద్ర వేసిన వార్న్ ఇటీవలే థాయిలాండ్‌లో గుండెపోటుతో అకాల మరణం చెందాడు. వార్న్ మరణాన్ని సహచర ఆస్ట్రేలియా క్రికెటర్లతో పాటు అతని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆస్ట్రేలియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అన్ని జట్లలోనూ వార్న్‌ను అభిమానించే వారికి కొదవలేదు. ఇక వార్న్ కుటుంబ సభ్యులు అయితే తల్లడిల్లిపోతున్నారు. వార్న్‌కు ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నాడు.

తమ తండ్రి అకాల మరణంతో వీరు మనో వేదనకు గురయ్యారు. ఈ మేరకు వీరు తమ తండ్రికి నివాళులర్పిస్తూ భావోద్వేగపూరిత లేఖను విడుదల చేశారు. సోషల్ మీడియాలో వార్న్ పిల్లలు పోస్ట్ చేసిన లేఖ అభిమానులను కలచి వేస్తోంది. మా నాన్నే నాకు బెస్ట్ ఫ్రెండ్. లవ్ యూ డాడీ. నా హృదయంలో మిగిల్చి వెళ్లిన శూన్యతను ఏదీ పూరించలేదని భావిస్తున్నా. నా జీవితంలో మీరు లేని లోటు ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. మీరు లేని జీవితం ఎంతో బాధకరమని వార్న్ కుమారుడు జాక్‌సన్ ట్విట్ చేశాడు. ఇక పెద్ద కుమార్తె బ్రూక్, చిన్న కుమార్తె సమ్మర్ కూడా తండ్రిపై తమకున్న ప్రేమను లేఖ ద్వారా చాటారు.

మీరు లేని జీవితాన్ని ఊహించుకోలేక పోతున్నాం. మీరు లేరనే విషయాన్ని జీర్ణించుకోవడం మాకు చాలా కష్టంగా మారింది. మీరు పక్కన ఉంటే మేమంతా ఎంతో సురక్షితంగా ఉంటామనే నమ్మకం. మీరు మరణించలేదు నాన్న. ఇక్కడ నుంచి మీరు హృదయంలోకి వచ్చారు డాడీ ఉంటూ చిన్న కుమార్తె లేఖను పోస్ట్ చేసింది. డాడీ.. నిన్ను చాలా మిస్ అవుతున్నా.. ప్రపంచంలోనే నువ్వు ఉత్తమ తండ్రివి. నీలాంటి తండ్రి దొరకడం నా అదృష్టం. మనమిదద్దరం చాలా విషయాల్లో సారూప్యత కలిగి ఉన్నాం. దీన్ని మీ నుంచి లభించిన వారసత్వంగా భావిస్తూ ముందుకు సాగుతా అంటూ పెద్ద కుమార్తె బ్రూక్ ట్విట్ చేసింది. మరోవైపు వార్న్ తల్లిదండ్రులు కీత్, బ్రిగిట్ కూడా శోకసంద్రంలో మునిగి పోయారు. తమ కొడుకు మృతి చెందాడనే వార్తను విని వీరు చలించి పోయారు. కొడుకు జ్ఞాపకాలను నెమరేసుకుంటూ తమ ఆవేదనను వెల్లబుచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News