Monday, April 14, 2025

2024-25లో 19% వృద్ధిని నమోదు చేసిన లెక్సస్ ఇండియా

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ లో అద్భుతమైన 19% వృద్ధిని అందుకున్నట్లు ప్రకటించింది లెక్సస్ ఇండియా. ఇది భారతదేశంలోని లగ్జరీ ఆటోమోటివ్ రంగంలో లెక్సస్ ఇండియా బ్రాండ్ కు పెరుగుతున్న ఆదరణను బలోపేతం చేస్తుంది. అసాధారణమైన వాహనాలు మరియు అత్యుత్తమ కస్టమర్ అనుభవాలను అందించడంలో లెక్సస్ యొక్క నిబద్ధతకు ఈ బలమైన పనితీరు నిదర్శనంగా నిలుస్తోంది.

ఇప్పుడే కాకుండా 2025 మొదటి త్రైమాసికంలో కూడా లెక్సస్ ఇండియా అద్భుతమైన ప్రదర్శన చూపింది. ఇంకా చెప్పాలంటే 2024 మొదటి త్రైమాసికంతో పోలిస్తే అమ్మకాలలో 17% పెరుగుదలను నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో NX మోడల్ ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అన్నింటికి మించి ఈ పెరుగుదల భారతీయ వినియోగదారులు లగ్జరీ SUVలను కోరుకుంటున్నారన్న విషయాన్ని ఇది ప్రధానంగా హైలెట్ చేసింది. దీంతోపాటు LM మోడల్ కూడా అత్యుత్తమ డిమాండ్‌ను ప్రదర్శించింది. లగ్జరీ మొబిలిటీ విభాగంలో పెరుగుదలకు ఈ మోడల్ కారణం అయ్యింది.

మార్చి 2025లో, లెక్సస్ ఇండియా ఇప్పటివరకు అత్యధిక నెలవారీ అమ్మకాలను చూసింది. మార్చి 2024తో పోలిస్తే బ్రాండ్ 61% వృద్ధిని నమోదు చేసింది. వీటిల్లో NX మోడల్ అసాధారణ వృద్ధిని సాధించింది. మరోవైపు RX మోడల్ స్థిరమైన పనితీరును కొనసాగించింది. మార్చి 2024 తో పోలిస్తే NX మరియు RX మోడళ్ల సంయుక్త SUV లైనప్ 63% పెరిగింది. LM వృద్ధి చెందుతూనే ఉంది. దీన్నిబట్టి చూస్తే వినియోగదారులు ఈ రెండు మోడళ్ల కొనుగోలుపై ఆసక్తి చూపిస్తున్నారనే విషయం అర్థం అవుతుంది. అంతేకాకుండా తాజాగా LX కోసం ఇటీవల ప్రకటించిన బుకింగ్‌లు కూడా బలమైన డిమాండ్ కు కారణం అయ్యాయి.

ఈ సందర్భంగా లెక్సస్ ఇండియా అధ్యక్షుడు హికారు ఇకేయుచి మాట్లాడుతూ, “భారతదేశంలో లెక్సస్ వాహనాలపై మా వినియోగదారులు చూపిన అచంచలమైన నమ్మకం మరియు ఉత్సాహానికి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 19% వృద్ధిని సాధించడం, 2025కి 17% మొదటి త్రైమాసిక వృద్ధితో బలమైన ప్రారంభం సాధించడం, అసమానమైన లగ్జరీ మరియు అసాధారణమైన అతిథి అనుభవాలను అందించడంలో మా నిబద్ధతకు నిదర్శనం. ఈ మైలురాళ్ళు మరిన్ని రికార్డుల్ని సృష్టించేందుకు మరియు సరికొత్త సరిహద్దులను అధిగమించడానికి మాకు మరింత స్ఫూర్తిని ఇస్తుంది. మేము ముందుకు సాగుతున్న కొద్దీ, లగ్జరీ మొబిలిటీని పునర్నిర్వచించడం, స్థిరత్వాన్ని స్వీకరించడం మరియు అతిథి అంచనాలను అధిగమించడం పట్ల మేము అంకితభావంతో ఉన్నాము.” అని అన్నారు.

లెక్సస్ జపనీస్ ఫిలాసఫీ అయినటువంటి ఒమోటెనాషిని స్వీకరించింది. ఇక్కడ ప్రతీ పని గౌరవం మరియు వినియోగదారుల సంరక్షణను ప్రతిబింబిస్తుంది. దీన్ని మరింత బలోపేతం చేయడానికి, లెక్సస్ ఇండియా ఇటీవల సౌకర్యవంతమైన మరియు ప్రత్యేకమైన లెక్సస్ లగ్జరీ కేర్ సర్వీస్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ఇందులో 3 సంవత్సరాలు / 60,000 కి.మీ లేదా 5 సంవత్సరాలు / 100,000 కి.మీ లేదా 8 సంవత్సరాలు / 160,000 కి.మీలలో లభించే కంఫర్ట్, రిలాక్స్ మరియు ప్రీమియర్ ఎంపికలు ఉన్నాయి. ఈ సర్వీస్ ప్యాకేజీ ద్వారా వినియోగదారులు బహుళ ఆఫర్‌లను అందుకోవచ్చు.

భారతదేశంలో 8 ఏళ్ల కార్యకలాపాలను పూర్తి బలమైన వృద్ధితో కొనసాగించిన లెక్సస్ ఇండియా… ఈ ఏడాది అంటే 2025లో కూడా ఇదే ఊపును కొనసాగించాలని భావిస్తోంది. లగ్జరీ ఆటోమోటివ్ మార్కెట్‌లో తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటూ విలువైన వినియోగదారులకు చిరస్మరణీయ అనుభవాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News