Friday, December 20, 2024

ఢిల్లీలో తెలంగాణ చట్టం అమలుకు లెఫ్టెనెంట్ గవర్నర్ ఆమోదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తీవ్రమైన నేరాలకు పాల్పడిన నేరస్థులను పోలీసులు ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకోవడాన్ని అనుమతిస్తున్న ఓ తెలంగాణ చట్టాన్ని ఢిల్లీలో అమలు చేయాలన్న ప్రతిపాదనను ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్‌వికె సక్సేనా ఆమోదించి దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ను జారీ చేయడం కోసం ఆ ప్రతిపాదనను కేందర హోంమంత్రిత్వశాఖకు పంపించారు. క్రిమినల్ కార్యకలాపాలను సమర్థవంతంగా అదుపు చేయడానికి కఠినమైన చట్టం అవసరమని అభిప్రాయపడిన ఢిల్లీ పోలీసులు 1986 నాటి తెలంగాణ ప్రమాదకర కార్యకలాపాల నిరోధక చట్టాన్ని ఢిల్లీకి కూడా వర్తింపజేయడానికి ఆమోదం తెలియజేయాలని ఓ ప్రతిపాదనను గత జూన్‌లో లెఫ్టెనెంట్ గవర్నర్‌కు పంపించారు.

స్మగ్లింగ్, మాదక ద్రవ్యాల అక్ర రవాణా, భూ ఆక్రమణలు, నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసే వారు, దోపిడీలు, ఆయుధాల అక్రమ వ్యాపారం, లైంగిక నేరాలు, సైబర్ నేరాలులాంటి తీవ్రమైన నేరాలను అరికట్టడానికి ఈ చట్టాన్ని వర్తింపజేస్తారు. ఈ ప్రతిపాదనను సక్సేనా ఆమోదించి కేంద్ర పాలిత ప్రాంతాల చట్టం సెక్షన్ 2 కింద నోటిఫికేషన్ జారీ చేయడం కోసం దీన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. హోంమంత్రిత్వ శాఖ దీనిపై నిర్ణయం తీసుకుంటుందని ఆ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News