Sunday, December 22, 2024

లైఫ్స్ గుడ్ స్కాలర్ షిప్ ప్రోగ్రాంను ప్రకటించిన LG ఎలక్ట్రానిక్స్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారతదేశపు ప్రముఖ వినియోగదారు డ్యూరబుల్ బ్రాండ్ LG ఎలక్ట్రానిక్స్, తమ ఫ్లాగ్ షిప్ CSR చొరవ లైఫ్స్ గుడ్ స్కాలర్ షిప్ ప్రోగ్రాంను ప్రకటించింది. ఈ చొరవ బాలికా విద్యను ప్రోత్సహించడంపై దృష్టి కేంద్రీకరించడం సహా ఉన్నతమైన విద్యను కొనసాగించడానికి ఆర్థిక సహాయం కేటాయించడం ద్వారా తమ విద్యా ప్రయాణంలో భారతదేశంవ్యాప్తంగా విద్యార్థులకు మద్దతు చేసే లక్ష్యాన్ని కలిగి ఉంది.

LG ఎలక్ట్రానిక్స్ ఇండియా నోయిడాలోని తమ కార్పొరేట్ కార్యాలయంలో ఈ రోజు విజయవంతంగా తమ ఫ్లాగ్ షిప్ ఉపకారవేతనం ప్రోగ్రాం యొక్క మొదటి ఎడిషన్ ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో MD – LG ఎలక్ట్రానిక్స్ ఇండియా 3 సంస్థలు నుండి స్కాలర్స్ ను సన్మానించింది- గల్గోటియా యూనివర్శిటీ, జైపూరియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ & లాయడ్ లా కాలేజీ.

ద లైఫ్స్ గుడ్ స్కాలర్ షిప్ ప్రోగ్రాం ఉన్నత విద్యను అభ్యసించు ఏ విద్యా సంవత్సరం చదువుతున్న విద్యార్థులకైనా అందుబాటులో ఉంటుంది. అయితే తమ ఇంతకు ముందు తరగతిలో కనీసం 60% అర్హత ప్రమాణం వారు పొందాలి. రెండు కీలకమైన ప్రమాణం ఆధారంగా ఉపకారవేతనాలు అందచేయబడతాయి: అవసరం ఆధారంగా, ప్రతిభ ఆధారంగా ఎంపిక.

అవసరం ఆధారిత శ్రేణి కింద, ఆర్థికంగా బలహీనంగా ఉన్న నేపధ్యం నుండి వచ్చిన విద్యార్థులకు 25% ఉపకార వేతనాలు కేటాయించబడతాయి. ప్రతిభ ఆధారిత ఉపకార వేతనాలు, తమ 12వ తరగతి గ్రేడ్ పరీక్షల్లో కనీసం 75% మార్కులు సంపాదించిన విద్యార్థులకు లేదా తదుపరి విద్యా సంవత్సరాల్లో 7 జిపిఏ సంపాదించిన వారికి కేటాయించబడతాయి. ముఖ్యంగా, బాలిక విద్యను ప్రోత్సహించాలని ప్రోగ్రాం యొక్క లక్ష్యానికి అనుగుణంగా ప్రతిభ కలిగిన ఆడ విద్యార్థులకు 25% ఉపకార వేతనం కేటాయించబడుతుంది.

అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం ఆర్థిక సహాయం 50% ట్యూషన్ ఫీజుగా లేదా రూ.1 లక్ష వరకు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం రూ.2 లక్షల వరకు, ఏది తక్కువగా ఉంటే తదనుగుణంగా ఉంటుంది.

ఇదే విషయం గురించి వ్యాఖ్యానిస్తూ, హాంగ్ జు జియాన్, ఎంజి, LG ఎలక్ట్రానిక్స్ ఇండియా ఇలా అన్నారు, “మా నిబద్ధత వినూత్నమన ఉత్పత్తులు, సేవలను అందించడానికి మించి ఉంది; అర్థవంతమైన చొరవల ద్వారా ప్రజల జీవితాలలో వాస్తవమైన మార్పును కలిగించడానికి మేము కృషి చేస్తాం. ఆరోగ్యం & పోషకాహారం, విద్య & నైపుణ్యం వంటి వాటిపై మేము దృష్టిసారించే కీలకమైన CSR ప్రయత్నాలుగా ఉన్నాయి. లైఫ్స్ గుడ్ స్కాలర్ షిప్ ప్రోగ్రాంతో, ఉన్నతమైన విద్యను అనుసరించే యువ మేధస్సులను ప్రేరేపించి, మద్దతు చేయటానికి, వారి కలలను సాధించే లక్ష్యాన్ని మేము కలిగి ఉన్నాము. సామాజిక ప్రగతికి మరియు ఆర్థిక సాధికారతు విద్య అనేది ప్రాధమికం అని మేము విశ్వసిస్తాం.”

అషుతోష్ బర్నవాల్, స్థాపితులు & సిఈఓ, బడ్డీ 3 స్టడీ ఇలా అన్నారు.. “లైఫ్స్ గుడ్ స్కాలర్ షిప్ ప్రోగ్రాం ద్వారా విద్యను మద్దతు చేయడానికి తమ నిబద్ధత కోసం మేము LG ఎలక్ట్రానిక్స్ ఇండియాను ఎంతగానో ప్రశంశిస్తాం. బడ్డీ4 స్టడీలో, మేము ఈ చొరవపై సహకరించడానికి గర్విస్తున్నాం, ఇది అర్హత గల విద్యార్థులకు సాధికారత కలిగిస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న విద్యార్థులు తమ విద్యాపరమైన కలలు సాకారం చేయడానికి తోడ్పడుతుంది. భారతదేశంవ్యాప్తంగా ఉన్న ప్రతిభ గల యువత మార్గంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవకుండా నిర్థారించడంలో ఈ ప్రోగ్రాం ఒక కీలకమైన చర్య“

లైఫ్స్ గుడ్ స్కాలర్ షిప్ అనేది NGO బడ్డీ 4 స్టడీ ఫౌండేషన్ తో ఒక ఉమ్మడి ప్రయత్నం. ఇది ప్రతిభ గల యువతను గుర్తించి, మద్దతు చేయడంలో సహాయపడుతుంది, ప్రతిభ గల, ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులు ఇరువురికీ చదువుకోవడానికి సమానమైన అవకాశాలు కల్పించడం నిర్థారిస్తుంది. విద్యకు ఆర్థిక అడ్డంకులను తగ్గించడం ద్వారా, భవిష్య నాయకుల అభివృద్ధిని ప్రోత్సహించే ఈ చొరవ ద్వారా, ఒక అర్థవంతమైన ప్రభావాన్ని కలిగించే లక్ష్యాన్ని LG ఎలక్ట్రానిక్స్ కలిగి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News