Monday, December 23, 2024

పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో సినిమా హాళ్లను ప్రారంభించిన ఎల్‌జి

- Advertisement -
- Advertisement -

LG opened cinema halls in Pulwama and Shopian districts

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లోని పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో రెండు మల్టీపర్పస్ సినిమాహాళ్లను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదివారం ప్రారంభించారు. ఇటువంటి మల్టీపర్పస్ సినిమా హాళ్లను త్వరలో ప్రతిజిల్లాలో నిర్మిస్తామన్నారు. ఇప్పుడు ప్రారంభమైన ఈ రెండు సినిమాహాళ్లను పుల్వామా, షోపియాన్ యువతకు అంకితం చేస్తున్నానని, ఇది చారిత్రక దినమని ఆయన అభివర్ణించారు. ఇక్కడ మూవీ స్క్రీనింగ్, ఇన్ఫోటెయిన్‌మెంట్, యువతకు నైపుణ్య శిక్షణ వంటి సదుపాయాలున్నాయని సిన్హా కార్యాలయం ఇచ్చిన ట్వీట్‌లో పేర్కొంది. పుల్వామా లోని ద్రుస్సు, ఎంసి షొపియాన్ థియేటర్లకు విద్యార్థులు, యువకులు, ప్రజలు విశేషంగా తరలి వచ్చారు. ఇవే కాకుండా అనంతనాగ్, శ్రీనగర్, బండిపొర, గండేర్‌బాల్, దోడా, పూంచ్, కిష్తార్, రేసి ప్రాంతాల్లోకూడా త్వరలో సినిమా హాళ్లు రానున్నాయని అధికార ప్రతినిధి తెలిపారు. కశ్మీర్ లోని మొదటి ఐనాక్స్ మల్టీప్లెక్స్ శ్రీనగర్ సోమ్‌వర్ ఏరియాలో వచ్చేవారం ప్రారంభం కానున్నది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News