Wednesday, December 25, 2024

XBOOM సీరీస్ ను విడుదల చేసిన ఎల్జీ

- Advertisement -
- Advertisement -

భారతదేశపు వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్స్ లో ఒకటి LG ఎలక్ట్రానిక్స్ తన ఆడియో శ్రేణికి సరికొత్త చేరికలను, LG XBOOM సీరీస్ ను విడుదల చేసింది. XG2T, XL9T, XO2T మోడల్స్ దీనిలో ఉన్నాయి. మెరుగైన సౌండ్ నాణ్యత, మెరుగుపరచబడిన పోర్టబిలిటి, లైటింగ్ ఫీచర్లతో ఆడియో అనుభవాన్ని పెంచడానికి ఈ కొత్త కలక్షన్ రూపొందించబడింది, దేశవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియుల కోసం ఇండోర్, అవుట్ డోర్ సెట్టింగ్స్ రెండిటిని అందిస్తుంది.

తమ కొత్త XBOOM సీరీస్ తో, LG ఎలక్ట్రోనిక్స్ ఆడియో వినూత్నత కోసం కొనసాగుతోంది, వివిధ రకాల మ్యూజిక్ అనుభవాల శ్రేణికి తగినట్లుగా శక్తివంతమైన సౌండ్, స్టైలిష్ డిజైన్, పోర్టబిలిటీలను కలిపే ప్రోడక్ట్స్ ను అందిస్తోంది. ప్రతి మోడల్ డైనమిక్ సౌండ్ అవుట్ పుట్, లీనయ్యే లైటింగ్ నుండి మన్నిక వరకు సామర్థ్యాలతో నిండింది, XBOOM సీరీస్ ను కుటుంబ సమావేశాలు కావచ్చు, అవుట్ డోర్ సాహసాలు లేదా ఇంట్లోనే సాయంత్రాలు కోసం ఇలా అన్ని సందర్భాల కోసం ఎంపిక చేసుకునే ఆప్షన్ గా చేసింది.

“మా కొత్త XBOOM సీరీస్ విడుదలతో, LG టెక్నాలజీతో సౌకర్యాన్ని కలిపే ఆడియో ఉత్పత్తులను తీసుకువస్తోంది,” అని బ్రియాన్ యంగ్, డైరెక్టర్, హోమ్ ఎంటర్టైన్మెంట్ LG ఎలక్ట్రానిక్స్ ఇండియా అన్నారు. “మా కస్టమర్లు సౌండ్ ను అనుభవించే విధానాన్ని మెరుగుపరచడానికి, శక్తివంతమైన ఆడియో, లైటింగ్ ఫీచర్లు, మన్నికతో ప్రతి వాతావరణానికి అనుకూలంగా ఈ మోడల్స్ రూపొందించబడ్డాయి. మీరు ఉత్సాహవంతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నా, సాహసం చేయడానికి వెళ్తున్నా, లేదా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నా, XBOOM సీరీస్ మీ ఆడియో అనుభవాన్ని మెరుగుపరిచే ప్రోడక్ట్ ను అందిస్తోంది”

LG XBOOM సీరీస్ కీలకమైన ఫీచర్లు
LG XBOOM XL9T అనగా పార్టీ స్పీకర్. అత్యధిక ప్రభావితమైన సౌండ్ అనుభవాల కోసం నిర్మించబడింది, డ్యూయల్ 8-అంగుళాల ఊఫర్లు, 3-అంగుళాల ట్వీటర్ల ద్వారా 1000W అవుట్ పుట్ ను అందిస్తోంది. మంద్రమైన శృతి మెరుగుదల అల్గోరిథమ్ తో XL9T మంచి మ్యూజిక్ అనుభవం కోసం లోతైన, ప్రతిధ్వనించే సౌండ్ ను అందిస్తుంది. ఇది ఊఫర్ లైటింగ్ తో పాటు కొత్త పిక్సెల్ LED ఫీచర్ ను కూడా కలిగి ఉంది. పార్టీలు, సమావేశాల కోసం పరిపూర్ణమైన ఆకర్షణీయమైన, క్లబ్ – వంటి పరిసరాలను కల్పించే కొత్త టెక్ట్స్, కారక్టర్లు లేదా ఇమోజీలను ఎవరైనా సృష్టించవచ్చు / అనుకూలంగా చేయవచ్చు. దీని నీటి-నిరోధకత కలిగిన IPX4 రేటింగ్ తో, సౌకర్యవంతమైన హ్యాండిల్, బలమైన వీల్స్ తో, XL9T పోర్టబిలిటి, నమ్మకాలను అందిస్తుంది, అవుట్ డోర్ కార్యక్రమాల కోసం ఉత్తమమైనది.

సౌండ్ నాణ్యతతో ఎలాంటి రాజీ లేకుండా పోర్టబిలిటి కోసం LG XBOOM GO XG2T రూపొందించబడింది. ఈ పొందికైన 5W పవర్ హౌస్ కు 1.5 అంగుళాల ఊఫర్, పాసివ్ రేడియేటర్ లు ఉంటాయి. తన సైజ్ కోసం డైనమిక్, అత్యధిక ఒత్తిడి గల సౌండ్ ను కలిగించే మంద్రమైన అల్గొరిథమ్ తో మెరుగుపరచబడింది. IP67 రేటింగ్, యుఎస్ మిలిటరి స్టాండర్డ్ మన్నికతో కఠినమైన పరిస్థితులను తట్టుకోవడానికి నిర్మితమైన, XG2T 10 గంటల వరకు ప్లేబ్యాక్ ను అందిస్తుంది, అవుట్ డోర్ సాహసాల కోసం పరిపూర్ణమైనది. దీని అనుకూలమైన స్ట్రింగ్ బ్యాక్ ప్యాక్స్, బైసైకిల్స్ , టెంట్లు, మరిన్నింటి కోసం సులభంగా జత చేయడానికి అవకాశం ఇస్తుంది. ప్రయాణంలో ఉత్తమమైన సహచరిగా ఉంటుంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ స్మార్ట్ ఫోన్ ను బయటకు తీయకుండానే కాల్స్ చేయడానికి సహాయపడుతుంది.

LG XBOOM XO2T తన 360- డిగ్రీల ఆమ్నీడైరక్షనల్ 20W సౌండ్ తో స్టైల్, ఫంక్షనాలిటీని కలుపుతుంది, మెరుగైన మంద్రమైన శృతి, స్పష్టమైన వాయిస్ నాణ్యతను అందిస్తుంది. సున్నితమైన, క్యాండిల్ –వంటి లైట్ ను వ్యాప్తి చేసే పారదర్శకమైన గ్లాస్ ప్రభావంతో మనోస్థితిని మెరుగుపరిచే లైటింగ్ ను సమీకృతం చేసి ఏ రకమైన ఏర్పాటులోనైనా సొగసైన పరిసరాలను కల్పిస్తుంది. XO2T IP55 నీటి నిరోధకత, 15+ గంటల బ్యాటరీ జీవిత కాలం అవుట్ డోర్, ఇండోర్ వాడకం కోసం దీనిని విలక్షణమైన ఎంపికను చేసింది. బ్లూటూత్ 5.3, LG వన్ టచ్ మోడ్, మల్టి-పాయింట్ భాగస్వామం ఫీచర్లతో, ఇది నిరంతరంగా ఆడియో అనుభవాలను మెరుగుపరుస్తుంది. ఈ స్పీకర్లు LG TVతో సమన్వయం కలిగి ఉంటాయి. అనుకూలమైన ఫ్రంట్ లేదా రియర్ పరిసర సెట్టింగ్స్, స్టీరియోతో పాటు ప్లే చేయబడతాయి. మీకు భిన్నమైన బ్రాండ్ టివి ఉన్నప్పటికీ XBOOM స్పీకర్లను మీ టివి/మొబైల్ డివైజ్ లకు కనక్ట్ చేయవచ్చు.

ధర, లభ్యత
LG XBOOM సీరీస్ భారతదేశంలో LG.com సహా రిటైల్, ఆన్ లైన్ ప్లాట్ ఫాంలలో 15 – నవంబర్-2024 నుండి కొనుగోలు చేయడానికి లభిస్తాయి. XG2T కోసం ధరలు రూ. 4,990, XO2T కోసం రూ. 12,990, XL9T కోసం రూ. 64,900 ప్రారంభమవుతాయి. ఆయా మోడల్స్ ని బట్టి ఫీచర్లు మారవచ్చు. మరింత సమాచారం కోసం, సందర్శించండి www.lg.com/in/audio.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News