Friday, January 10, 2025

ఢిల్లీ ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన లెఫ్టినెంట్ గవర్నర్

- Advertisement -
- Advertisement -

ఎన్నికల కమిషన్ సిఫార్సుల నేపథ్యంలో దేశ రాజధానిలో శాసనసభ ఎన్నికల కోసం గెజిట్ నోటిఫికేషన్‌ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా శుక్రవారం జారీ చేశారు. శుక్రవారం నాటి అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, ఎన్నికల కార్యక్రమాన్ని ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం ప్రకటించడమైంది. ‘భారత ఎన్నికల కమిషన్ సిఫార్సు ప్రకారం,ఢిల్లీ ఎన్‌సిటి శాసనసభకు సభ్యులను ఎన్నుకునేందుకు ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిటి)లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఢిల్లీ ఎన్‌సిటి లెఫ్టినెంట్ గవర్నర్ పిలుపు ఇస్తున్నారు’ అని నోటిఫికేషన్ తెలియజేసింది. త్వరలో రద్దయితే తప్ప ప్రస్తుత ఢిల్లీ శాసనసభ ఫిబ్రవరి 23 వరకు కొనసాగుతుందని,

ఆ తరువాత తన కాలపరిమితి తీరిపోగానే రద్దు అవుతుందని నోటిఫికేషన్ తెలిపింది. నోటిఫికేషన్ ప్రకారం, నామినేషన్ పత్రాల దాఖలుకు ఆఖరు తేదీ ఈ నెల 17, పరిశీలన 18న జరుగుతుంది, నామినేషన్ పత్రాల ఉపసంహరణను 20 వరకు అనుమతిస్తారు. ఫిబ్రవరి 5న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు వోటింగ్ జరుగుతుందని, ఎన్నికల ప్రక్రియ 10న ముగుస్తుందని నోటిఫికేషన్ వివరించింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ ప్రస్తుత శాసనసభ ఫిబ్రవరి 23న రద్దు అవుతుందని నోటిఫికేషన్ తెలిపింది. మొత్తం 70 నియోజకవర్గాలకు ఒకే దశలో ఫిబ్రవరి 5న తొమ్మిదవ ఢిల్లీ శాసనసభ ఎన్నికలునిర్వహించనున్నట్లు, 8న వోట్లు లెక్కించనున్నట్లు ఎన్నికల కమిషన్ ఈ నెల 7న ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News