- Advertisement -
హైదరాబాద్ : ఎల్జి ఎలక్ట్రానిక్స్ ఇండియా సరి కొత్త టోన్ఫ్రీ వైర్లెస్ ఇయర్‌బడ్స్ ను హెచ్బిఎస్ఎఫ్ఎన్7, హెచ్బిఎస్ఎఫ్ఎన్6 పేరిట మార్కెట్లోకి ఆవిష్కరించింది. వినూత్న యువినానో టెక్నాలజీతో వీటిని రూపొందించారు. హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఎల్జి బెస్ట్ షాప్‌లో ఆవిష్కరించిన ఈ హెచ్బిఎస్ఎఫ్ఎన్7, హెచ్బిఎస్ఎఫ్ఎన్6 ధరలు వరుసగా రూ.18,990, రూ.13,290గా ఉన్నాయి. ఎల్జి ఎలక్ట్రానిక్స్ ఇండియా రీజినల్ బిజినెస్ హెడ్ (తెలంగాణ, ఎపి) కె.శశికిరణ్ రావు మాట్లాడుతూ, ఈ సరికొత్త యువినానో చార్జింగ్ క్రాడిల్ 99.9 శాతం బ్యాక్టీరియాను తొలగిస్తుందని అన్నారు. చార్జింగ్, తయారీ నాణ్యతతో ఉంటుందని, వినే అనుభవం ఎంతో బాగుంటుందని అన్నారు.
- Advertisement -