Saturday, December 21, 2024

పెళ్లికి ముందు ఇదేం ప్యాష‌న్.. ఆకట్టుకుంటున్న ‘ఎల్‌జీఎం’ ట్రైల‌ర్

- Advertisement -
- Advertisement -

మారుతున్న ట్రెండ్‌లో ప్రేమ‌కు అర్థం మారిపోయింది. అమ్మాయి అబ్బాయి లివ్ ఇన్ రిలేష‌న్‌లో ఉండి.. న‌చ్చితే పెళ్లి బంధం వైపు అడుగులు వేస్తున్నారు. పెళ్లికి ముందు ఇదేం ప్యాష‌న్ అని అనుకోవ‌చ్చు. కానీ.. అబ్బాయిని అమ్మాయి.. అమ్మాయిని అబ్బాయి అర్థం చేసుకోవ‌టానికే ఈ లివ్ ఇన్ రిలేష‌న్ అనే భావ‌న ఉండటంతో చాలా మంది అటు వైపుగానే ఆలోచ‌న‌లు చేస్తున్నారు. స‌రే ఇదంతా బాగానే ఉంద‌ని అనుకుందాం.. అయితే పెళ్లి చేసుకుని ఓ ఇంట్లోకి కోడ‌లిగా అడుగు పెట్టాల్సిన అమ్మాయి త‌న ప్రేమికుడిని విచిత్ర‌మైన కోరిక కోరుతుంది. త‌న‌కు కాబోయే అత్త‌వారితో క‌లిసి కొన్ని రోజులు ట్రిప్‌కు వెళ‌తాన‌ని అప్పుడు ఇద్ద‌రికీ ఒక‌రి గురించి ఒక‌రికీ తెలుస్తుంద‌ని చెబుతుంది. నిజంగా ఇది కాస్త విచిత్రంగానే ఉన్నా.. కాబోయే అత్తా కోడ‌లు.. క‌లిసి చేసే ప్ర‌యాణం.. వారి మ‌ధ్య ఉన్న అబ్బాయి వారి స‌మ‌స్య‌ల‌ను స‌ర్దుబాటు చేయ‌లేక మాన‌సికంగా ప‌డే బాధ‌ల‌ను తెలుసుకోవాలంటే ‘ఎల్‌జీఎం’ ( LGM (Lets Get Married)) సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.

ఇండియ‌న్ క్రికెట్ హిస్ట్రరీలో స‌క్సెస్‌ఫుల్ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై LGM సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ కానుంది. హ‌రీష్ క‌ళ్యాణ్‌, ఇవానా, న‌దియా, యోగిబాబు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని ర‌మేష్ త‌మిళ్ మ‌ణి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌టంతో పాటు సంగీతాన్ని కూడా అందిస్తున్నారు. ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సాక్షి ధోని, వికాస్ హ‌స్జా నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న ఈ సినిమా తెలుగు ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న సినిమాల్లో రాన‌టువంటి ఓ డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో LGM తెర‌కెక్కుతుంద‌ని ట్రైల‌ర్ చూస్తుంటేనే అర్థ‌మ‌వుతుంది. ఇక సినిమాలో హీరో హరీష్ క‌ళ్యాణ్‌, హీరోయిన్ ఇవానాతో పాటు హీరో త‌ల్లిగా న‌టించిన న‌దియా చాలా కీల‌క పాత్ర‌లో అల‌రించారు. ఇక సినిమాలో ఆడియెన్స్‌ను త‌న‌దైన కామెడీతో అల‌రించ‌టానికి యోగి బాబు  LGM చిత్రంతో రెడీ అయ్యారు.

సినిమా గురించి ద‌ర్శ‌కుడు ర‌మేష్ త‌మిళ్ మ‌ణి మాట్లాడుతూ ‘‘వైవిధ్యమైన చిత్రాలను ఆద‌రించ‌టంతో తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ముందుంటారు. ఇది చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు అలాంటి డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో LGM సినిమాను రూపొందించాను. కుటుంబం ఎలా ఉండాలి. ప‌రిస్థితుల‌ను ఎలా అవ‌గాహ‌న చేసుకోవాలి. స‌ర్దుకు పోవాల‌నే విష‌యాల‌ను కామెడీ కోణంలో చూపిస్తూనే మంచి ఎమోష‌న‌ల్ టచ్‌తో సినిమాను రూపొందించాం. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.

మహేంద్ర సింగ్ ధోని మాట్లాడుతూ ‘‘నేను సినిమా చూశాను. చాలా క్లీన్ మూవీ. చక్కటి ఎంట‌ర్‌టైన‌ర్‌. నేను నా కుమార్తెతో క‌లిసి  ఎల్‌జీఎం సినిమా చూస్తాను. త‌ను నన్ను చాలా ప్ర‌శ్న‌లు వేస్తుంది. అయితే కూడా నేను త‌న‌తోనే సినిమా చూస్తాను. న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ అద్భుతంగా వ‌ర్క్ చేశారు. చాలా మంచి టీమ్ కుదిరింది. ఈ సినిమాను నేను రూపొందించినందుకు గ‌ర్వంగా ఉంది. డైరెక్ట‌ర్ ర‌మేష్ త‌మిళ్ మ‌ణి ఓ ఆర్కిటెక్ట్ కూడా.

నా భార్య సినిమా చేయాల‌ని నాతో చెప్పిన‌ప్పుడు నేను త‌న‌తో ఒకే మాట చెప్పాను. అదేంటంటే..సినిమా చేయ‌టం అంటే ఓ ఇంటిని డిజైన్ చేసిన‌ట్లు కాద‌ని. నువ్వు ఓ క‌థ‌ను ఫిక్స్ చేసుకుని, న‌టీన‌టులను కూడా ఎంపిక చేసుకో. నువ్వు ఒక్కసారి ఓకే అన్న‌త‌ర్వాత సినిమా చేస్తాన‌ని అన్నాను. అలా సినిమాను స్టార్ట్ చేశాం. మంచి టీమ్ కార‌ణంగానే త‌క్కువ స‌మ‌యంలోనే సినిమాను కంప్లీట్ చేశాం. సినిమా యూనిట్‌కు మంచి ఫుడ్ ఉండేలా చూసుకోమ‌ని చెప్పాను.

నేను విధిని న‌మ్ముతాను. నా టెస్ట్ కెరీర్ చెన్నైలోనే ప్రారంభ‌మైంది. క్రికెట్ విషయానికి వ‌స్తే హ‌య్య‌స్ట్ టెస్ట్ స్కోర్ కూడా చెన్నైలోనే సాధించాను. ఇలా చెన్నైతో నాకు మంచి అనుబంధం ఉంది. ఇక్క‌డ ప్ర‌జ‌ల ప్రేమాభిమానాలు చాలా గొప్ప‌గా ఉన్నాయి. చాలా ఒడుదొడుకుల త‌ర్వాత ఈ ఏడాది మ‌ళ్లీ మేం ఫామ్‌లోకి రావ‌టం మ‌ర‌చిపోలేని విష‌యం. సీఎస్‌కే టీమ్ ఎక్క‌డ‌కు వెళ్లినా అక్క‌డ మాకు అప‌రిమిత‌మైన ప్రేమ దొరికింది. ఇక ఎల్‌జీఎం సినిమా విష‌యానికి వ‌స్తే త్వ‌ర‌లోనే సినిమాను రిలీజ్ చేస్తాం. చాలా ఎంజాయ్ చేస్తారు. అత్త‌, కోడలు.. వారి మ‌ధ్య‌లో ఇబ్బంది ప‌డే కొడుకు ఇలా ముగ్గురు  వ్య‌క్తుల‌కు సంబంధించిన సినిమా ఇది’’ అన్నారు.

సాక్షి ధోని మాట్లాడుతూ ‘‘LGM సినిమా గురించి చెప్పాలంటే మన చుట్టూ చాలా మంది ిలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంటారు. ఇలాంటి  పాయింట్ మీద సినిమా ఎందుకు చేయ‌కూడ‌ద‌నిపించింది. అప్పుడు ద‌ర్శ‌కుడు ర‌మేష్‌తో మాట్లాడి సినిమాను స్టార్ట్ చేశాం. ఈ సినిమా ప‌ర్టికుల‌ర్‌గా త‌మిళంలోనే చేయ‌టానికి కార‌ణం ధోనీయే. చెన్నైతో మాకున్న అనుబంధం కార‌ణంగా మా తొలి సినిమాను ఇక్క‌డే చేశాం’’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News