Monday, January 20, 2025

రెండో రోజూ ‘కాసుల వర్షం’

- Advertisement -
- Advertisement -

Liam Livingstone Picked By Punjab Kings For Rs 11.50 Crore

లివింగ్‌స్టోన్ రూ. 11.50 కోట్లు
ఒడియాన్ స్మిత్‌కు 6 కోట్లు
ఐపిఎల్ 2022 వేలం

బెంగళూరు : ఐపిఎల్ 2022 సీజన్‌కు వేలంలో ఆటగాళ్లకోసం ఫ్రాంచైజీలు డబ్బులు కుమ్మరిస్తున్నారు. అందులో భాగంగా తొలి రోజు శనివారం వేలంలో 74 మంది ఆటగాళ్లు అమ్ముడుపోగా.. 23మందిని ఎవరూ తీసుకోలేదు. అయినా ఇంకా జట్లలో కొందరు ఆటగాళ్లతో భర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే స్టార్ ఆటగాళ్ల కోసం పెద్ద మొత్తంలో ఫ్రాంచైజీలు డబ్బులు వెచ్చించారు. ఈ నేపథ్యంలో రెండో రోజు ఆదివారం కొనసాగే వేలంలో అదేస్థాయిలో వేలం జరిగింది. మరి ఏ ఆటగాడు ఎంత ధరకు ఏ టీమ్ కొనుగోలు చేసిందో చూద్దాం.

ఆదివారం వేలంలో ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ లియామ్ లివింగ్‌స్టోన్, వెస్టిండీస్‌కు చెందిన ఒడియాన్ స్మిత్‌లు భారీ ధర పలికారు. లివింగ్‌స్టోన్ రూ. 11.50 కోట్లు, ఒడియాన్ రూ. 6 కోట్లు పెద్ద మొత్తం వెచ్చించి దక్కించుకుంది. ఇతడి కోసం పంజాబ్ కింగ్స్, కేకేఆర్ పోటీ పడ్డాయి. చివరలో అనూహ్యంగా ఎస్‌ఆర్‌హెచ్ వేలంలోకి దూసుకొచ్చింది. రూ. కోటి కనీస ధరతో బరిలోకి దిగిన లివింగ్‌స్టోన్‌ను రూ. 11.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. కనీస ధర రూ. కోటితో బరిలోకి దిగిన స్మిత్‌నూ పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. అతని కోసం ఎస్‌ఆర్‌హెచ్, పంజాబ్ కింగ్స్, లక్నో పోటీపడ్డాయి. టిమ్ డేవిడ్ ను ముంబై ఇండియన్స్ రూ.8.25 కోట్లకు సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఈ సారి భారీ ధర పలికాడు. ముంబై ఇండియన్స్ అతడిని రూ. 8 కోట్లకు కొనుగోలుచేసింది.

వెస్టిండీస్ ఆల్ రౌండర్ రొమారియో షెపర్డ్ ని రూ. 7.75 కోట్లకుసన్ రైజర్స్ దక్కించుకుంది. భారత్‌కు చెందిన లెఫ్ట్ హ్యండ్ పేసర్ ఖలీల్ అహ్మెద్ రూ. 5.25 కోట్లు, చేతన్ సకరియా రూ. 4.20 కోట్లకు అమ్ముడయ్యారు. అదేవిధంగా మరో ఆల్‌రౌండర్ శివమ్ ధూబేను రూ. 4కోట్లు వెచ్చించి చైన్నై సూపర్ కింగ్స్ దిక్కించుకోగా.. గుజరాత్ టైటాన్స్, ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను రూ. 1.4కోట్లకు సొంతం చేసుకుంది. శ్రీలంకకు చెందిన స్పెషలిస్ట్ స్పిన్నర్ మహేశ్ తీక్సానాను రూ. 70లక్షలకు చైన్నై సూపర్‌కింగ్స్ టీమ్ కొనుగోలు చేసింది. కాగా, తీక్సానా గతేడాది భారత్‌శ్రీలంక టూర్‌లో ఆకట్టుకున్నాడు. టీమిండియా టెస్టు బ్యాట్స్‌మెన్ అజింక్యా రహానెను కోల్‌కతా నైటఖ రైడర్స్ రూ. 1కోటికి సొంతం చేసుకోగా, మరో టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్ష్‌మెన్ చటేశ్వరాపుజారాకు ఎప్పటిలాగే ఈసారి వేలంలో ఎవరూ కొనుగోలు చేయలేదు.

తొలి ఆటగాడిగా ఎయిడెన్ మార్క్రమ్ వచ్చాడు. మార్క్రమ్ కనీస ధర రూ. కోటి కాగా.. ఎస్‌ఆర్‌హెచ్ రూ. 2.60 కోట్లకు మార్క్రమ్‌ను సొంతం చేసుకుంది. మన్‌దీప్ సింగ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. అతని కనీస ధర రూ. 50 లక్షలు కాగా.. రూ. 1.10 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డొమినిక్ డ్రేక్స్ కనీస ధర రూ. 75 లక్షలు కాగా.. వేలంలో గుజరాత్ టైటాన్స్ రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. కనీస ధర రూ. కోటితో బరిలోకి దిగిన టీమిండియా యువ స్పిన్నర్ జయంత్ యాదవ్‌ను రూ. 1.70 కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. కనీస ధర రూ.50 లక్షలతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జాన్సన్‌ను రూ. 4. 20 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్ సొంతం చేసుకుంది.

ముంబై ఇండియన్స్..

రెండో రోజు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రూ. 27 కోట్లతో బిడ్డింగ్‌కు దిగింది. మొదట నవదీప్ సైనీ కోసం వేలం ప్రారంభించి రాజప్థాన్ రాయల్స్‌తో పోటీ పడినా.. చివరకు సైనీ – రూ.2.60 కోట్లకు- రాయల్స్ సొంతం చేసుకుంది. అనంతరం జయదేవ్ ఉనద్కత్ – రూ. 1.30 కోట్లు-, తిలక్ వర్మ – రూ.1.70 కోట్లు, సంజయ్ యాదవ్ – రూ.50 లక్షలు- ముంబయి ఇండియన్స్ దక్కించుకుంది.

పంజాబ్‌కు రాజ్ బవా..

అండర్-19 వరల్డ్ కప్‌లో అదరగొట్టిన భారత ఆల్‌రౌండర్ రాజ్ బావాను రూ. 2 కోట్లకు పంజాబ్ సొంతం చేసుకుంది. బౌలింగ్‌లో ఇరగదీసిన రాజ్‌వర్ధన్ హంగార్గేకర్‌ను రూ.1.50 కోట్లకు చెన్నై కొనుగోలు చేసింది. ఉత్తర్‌ప్రదేశ్ లెఫ్టార్మ్ పేసర్ యష్ దయాల్ కోసం ఫ్రాంఛైజీలు తీవ్రంగా పోటీపడినా.. చివరకు గుజరాత్ టైటాన్స్ రూ.3.20 కోట్లకు దక్కించుకుంది. అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత్‌ను గెలిపించిన సారథి యశ్ థూల్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. రూ. 20 లక్షల కనీసధరతో వేలంలోకి వచ్చిన అతడిని రూ. 50 లక్షలకే ఢిల్లీ దక్కించుకుంది. మరో ఇటగాడు విక్కీ ఓస్తావల్, హర్నూర్ సింగ్‌లపై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. మహిపాల్ లొమ్రోర్ – రూ.95 లక్షలు- ఆర్సీబీ

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News