Saturday, November 23, 2024

చికాగోలో హైదరాబాద్ యువతికి విముక్తి

- Advertisement -
- Advertisement -

చికాగో : అమెరికాలోని చికాగోలో విషాదకర స్థితిలో ఉన్న హైదరాబాద్ పాతబస్తీ మహిళ సయిదా జైదీ కడగండ్లు తీర్చేందుకు రంగం సిద్ధం అయింది. విద్యాధికురాలైన ఆమె అనూహ్య పరిస్థితుల నడుమ చికాగో వీధుల్లో పార్క్‌వద్ద అడుక్కుని బతికే స్థితిలో ఉండగా హైదరాబాదీ ఒకరు గుర్తించారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. దీనితో చికాగోలోని భారత కాన్సులేట్ జనరల్ స్పందించింది. ఆమె వద్దకు సిబ్బంది వెళ్లింది. పూర్తి వైద్య సాయం, హైదరాబాద్‌కు పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. ఆమె మానసిక పరిస్థితి బాగా ఉందని, ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్న తన తల్లితో ఫోన్‌ద్వారా మాట్లాడిందని కాన్సులేట్ వర్గాలు తెలిపాయి.

ఆమెను కనుగొనడం కష్టమైంది. అయితే ఆమెను గుర్తించినట్లు , ఆమె హైదరాబాద్‌కు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తామని, అంత వరకూ అన్ని విధాలుగా ఇక్కడ ఆమె వసతి భోజన ఏర్పాట్లు చూస్తామని వివరించారు. జైదీ (37) విద్యార్థినిగా 2021 ఆగస్టులో అమెరికాకు వెళ్లారు. డెట్రాయిట్‌లోని ట్రినే వర్శిటీలో చదివే దశలో హైదరాబాద్‌లోని తన వారితో ఎప్పటికప్పుడు ఫోన్‌లో మాట్లాడుతూ వచ్చారు. అయితే రెండు నెలలుగా ఆమె నుంచి ఎటువంటి సమాచారం లేకుండా పోయింది. దీనితో ఆమె పరిస్థితి ఏమిటనేది కుటుంబ సభ్యులకు ఆందోళన కల్గించింది. కాగా ఈ మధ్యలోనే జైదీ అడుక్కుంటూ ఉన్నప్పటి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ఫోటో వార్తలు వెలువడటంతో కుటుంబీకులు కంగుతిన్నారు. ఆమెను తిరిగి హైదరాబాద్‌కు రప్పించేలా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, కాన్సులేట్ కార్యాలయాన్ని అభ్యర్థించారు. ఈ దశలో ఆమె క్షేమంగా ఇండియాకు హైదరాబాద్‌కు తిరిగివచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలియడంతో హైదరాబాద్‌లోని ఆమె ఆత్మీయులు ఆనందిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News