Thursday, January 23, 2025

మే 17న లైబ్రేరియన్ నియామక పరీక్ష

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : షెడ్యూల్ ప్రకారమే లైబ్రేరియన్ నియామక పరీక్షను నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్కొంది. మే 17న యథావిధిగా పరీక్ష కొనసాగుతున్నందని వెల్లడించింది. పరీక్షకు వారం ముందు నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని, వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని అభ్యర్థులకు సూచించింది. ఇంటర్, సాంకేతిక విద్యాశాఖలో లైబ్రేరియన్ పోస్టుల భర్తీ కోసం టీఎస్‌పీఎస్సీ నియామక పరీక్ష నిర్వహిస్తున్నది.

Also Read: స్టోయినిస్ మెరుపులు.. పంజాబ్ లక్ష్యం 258

విద్యాశాఖలో మొత్తం 71 లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్ చివరలో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంటర్ కమిషనరేట్‌లో 40 పోస్టులు, విద్యాశాఖలో 31 లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News