Tuesday, November 5, 2024

గ్రంథాలయ భవన నిర్మాణానికి రూ.కోటి నిధుల కోసం హరీష్ రావుకి వినతి…

- Advertisement -
- Advertisement -

హుజురాబాద్ లో గ్రంథాలయ భవన నిర్మాణానికి రూ.కోటి నిధుల కోసం మంత్రి హరీష్ రావు కి వినతి…
సానుకూలంగా స్పందించిన ఆర్థిక మంత్రి హరీష్ రావు : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి

కరీంనగర్: హుజురాబాద్ నియోజకవర్గ కేంద్రంలో నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి కావాల్సిన రూ. కోటి నిధుల అమలు కోసం జిల్లా మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరిశ్ రావుకు వారి కార్యాలయంలో కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఏనుగు రవీందర్ రెడ్డి కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం లోని హుజురాబాద్ పట్టణ కేంద్రంలో శిథిలావస్థలో ఉన్న పాత గ్రంథాలయ భవనాన్ని కూల్చి అధునాతన వసతులతో కూడిన నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి కావాల్సిన రూ.ఒక కోటి నిధుల మంజూరు చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రివర్యులు హరీష్ రావును కోరామన్నారు. మంత్రి హరీష్ రావు సానుకూలంగా స్పందించారని తొందరలోనే నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

హుజురాబాద్ కేంద్రంలో పురాతన గ్రంథాలయ భవనం నెలకొల్పి ఉందని దాని స్థానంలో అత్యాధునిక వసతులతో కూడిన విద్యార్థిని, విద్యార్థులకు, పోటీ పరీక్షల అభ్యర్ధులకు, కావాల్సిన అన్ని ఏర్పాట్లతో నిండిన నూతన భవనాన్ని నిర్మిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కెసిఆర్ ప్రభుత్వం చేపడుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా అనేక జిల్లాల్లో మండల కేంద్రాల్లో అన్ని హంగులలతో కూడిన నూతన పక్క భవనాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామీణ, పేద విద్యార్థి, ఉద్యోగ అభ్యర్థుల సౌలభ్యం కోసం ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News