Friday, November 15, 2024

డ్యామ్‌లు కూలిపోవడంపై లిబియా ప్రభుత్వం దర్యాప్తు

- Advertisement -
- Advertisement -

డెర్నా: లిబియా లోని కోస్తా నగరం డెర్నాలో రెండు డ్యామ్‌లు కుప్పకూలిపోవడంపై లిబియా ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. ఈ ప్రమాదం జరిగి వారం రోజులౌతున్నా ఇంకా వేలాది శవాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు 11వేల మందికి పైగా మృతి చెందారు. దాదాపు 10 వేల మంది గల్లంతయ్యారు. 1970లో నిర్మించిన ఈ డ్యామ్‌ల నిర్వహణకు తగిన నిధులు కూడా కేటాయించడమైంది. నగరం లోని స్థానిక అధికార యంత్రాంగాన్ని దీనిపై దర్యాప్తు చేయడమౌతుందని, అలాగే గత ప్రభుత్వాలపై కూడా దర్యాప్తు జరుగుతుందని లిబియా జనరల్ ప్రాసిక్యూటర్ అల్ సెడిక్ అల్ సోర్ వెల్లడించారు. ఈ విషయంలో తప్పుచేసిన వారిని, లేదా నిర్లక్షం చూపించినవారిని విడిచిపెట్టేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణకు పంపుతామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News