Saturday, November 23, 2024

ప్రీమియం వసూళ్లలో ఎల్‌ఐసి రికార్డు

- Advertisement -
- Advertisement -

LIC collects highest ever new premium of Rs 1.84 lakh cr

కరోనా సమయంలోనూ రూ.1.84 లక్షల కోట్ల కొత్త ప్రీమియం వసూళ్లు

న్యూఢిల్లీ : కరోనా సమయంలోనూ దేశీయ అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసి రికార్డు స్థాయి కొత్త ప్రీమియం వసూళ్లను రాబట్టింది. గణాంకాల ప్రకారం, కరోనా కాలంలో రూ.1.84 లక్షల కోట్ల కొత్త ప్రీమియం వసూళ్లు వచ్చాయి. సంస్థ పాలసీదారులకు రూ.1.34 లక్షల కోట్లు చెల్లించింది. గతేడాది (2020)లో కరోనా మహమ్మారి కారణంగా అధికంగా సవాలుతో కూడిన వ్యాపార వాతావరణం ఏర్పడిన నేపథ్యంలోనూ కొత్త వ్యాపారంలో ఎల్‌ఐసి అద్భుతమైన పనితీరును చూపింది. 202021 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసి (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) అత్యధిక ప్రీమియం ఆదాయం రూ.56,406 కోట్లు వచ్చింది. గతేడాదితో పోలిస్తే వ్యక్తిగత హామీ వ్యాపారంలో 10.11 శాతం వృద్ధిని చూపింది.

దాదాపు 2.10 కోట్ల ఎల్‌ఐసి పాలసీలు చేపట్టగా, ఒక్క మార్చి నెలలోనే 46.72 లక్షల కొత్త పాలసీలు వచ్చాయి. గతేడాది ఇదే నెలలో 298.82 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2021 మార్చి నెలలో పాలసీల్లో మార్కెట్ వాటాలో 81 శాతం, ఏడాదికి 74.58 శాతం ఎల్‌ఐసి సాధించింది. మొదటి ఏడాది ప్రీమియం మార్చి నెలకు 64.74 శాతం, మొత్తం ఏడాదికి 66.18 శాతం మార్కెట్ వాటా పెరిగింది. 2021 మార్చి నెలకు గాను ఎల్‌ఐసి మొదటి ఏడాది ప్రీమియం రూ.28,105 కోట్లతో 64.7 శాతం పెరగ్గా, 2020 మార్చిలో రూ.17,066 కోట్లు వచ్చింది. 202021 పూర్తి సంవత్సరంలో ప్రీమియం రూ.1,84,174 కోట్లతో 3.5 శాతం పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News