Tuesday, November 5, 2024

మే 17న ఎల్ఐసి మెగా లిస్టింగ్!

- Advertisement -
- Advertisement -

LIC

*దేశ చరిత్రలో అతిపెద్ద ఐపీఓ ఇదే *4 నుంచి ఎల్‌ఐసీ ఇష్యూ *  ఐపీఓ ధర శ్రేణి రూ.902-949  *పాలసీదారులకు ఒక్కో షేరుపై రూ.60 డిస్కౌంట్‌ *రిటైల్‌ మదుపర్లు, ఉద్యోగులకు రూ.45 రాయితీ

ముంబై: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) వచ్చేనెల 4న ప్రారంభమై 9న ముగియనుంది. పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా కంపెనీలో 3.5 శాతం ఈక్విటీ వాటాకు సమానమైన 22.13 కోట్ల షేర్ల విక్రయం ద్వారా రూ.20,557.23 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పె ట్టుకుంది. నిధుల సమీకరణ పరంగా భారత కార్పొరేట్‌ చరిత్రలో  ఇదే అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూ కానుంది.  ప్రభుత్వ దీర్ఘకాల వ్యూహాత్మక లక్ష్యాల్లో భాగంగానే ఎల్‌ఐసీని స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ చేస్తున్నట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ  (దీపమ్‌) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే విలేకరులకు తెలిపారు. స్టాక్‌ మార్కెట్‌ లిస్టింగ్‌ ద్వారా దీర్ఘకాలంలో కంపెనీ విలువ భారీగా పుంజుకోనుందన్నారు.  మార్కెట్లోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ఎల్‌ఐసీ ఐపీఓ నిధుల సేకరణ లక్ష్యానిది సరైన స్థాయేనని పాండే అన్నారు. ఇష్యూ ముగిశాక మార్కెట్లో ద్రవ్య లభ్యత తగ్గే ప్రమాదమేమీ లేదన్నారు.

ఐపీఓ ద్వారా విక్రయించనున్న షేర్ల ధర శ్రేణిని రూ.902-949గా నిర్ణయించారు. ఎల్‌ఐసీ షేర్లు కొనుగోలు చేయాలనుకునేవారు కనీసం 15 షేర్ల కోసం బిడ్‌ వేయాల్సి ఉంటుంది. బిడ్‌ను 15 షేర్ల చొప్పున పెంచుకుంటూ పోవచ్చు. ఎల్‌ఐసీ పాలసీదారులకు ఒక్కో షేరుపై రూ.60 డిస్కౌంట్‌ లభించనుండగా.. రిటైల్‌ మదుపరులు, కంపెనీ ఉద్యోగులకు రూ.45 రాయితీ లభించనుంది. సక్సె్‌సఫుల్‌ బిడ్డర్లకు షేర్ల కేటాయింపు వచ్చే నెల 12న జరగనుండగా.. వారి డీమ్యాట్‌ ఖాతాల్లోకి షేర్ల బదిలీ 16న జరగనుంది. 17న షేర్లను స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల్లో లిస్ట్‌ చేయనున్నట్లు ‘సెబీ’కి బుధవారం సమర్పించిన తుది ముసాయిదా పత్రాల్లో కంపెనీ వెల్లడించింది. ఐపీఓలో భాగం గా కంపెనీ మార్కెట్‌ విలువను రూ.6.07 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. ఈ ప్రకారంగా, స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యాక ఎల్‌ఐసీ దేశంలో ఐదో అత్యంత విలువైన కంపెనీగా అవతరించనుంది. ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీల్లో 186వ స్థానంలో ఉండనుంది.

Image

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News