- Advertisement -
న్యూఢిల్లీ : దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసి ఐపిఒ కోసం పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎల్‌ఐసి తన ఐపిఒ కోసం ఈ నెల మూడో వారంలో రెగ్యులేటర్ సెబీ దాఖలు చేసే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. నివేదికల ప్రకారం, ఎల్‌ఐసి అధికారులు గ్లోబల్ ఇన్వెస్టర్లతో జరిపిన చర్చల్లో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఐపిఒ లిస్టింగ్ 2022 ఆర్థిక సంవత్సరానికి ముందే పూర్తవుతుందని ప్రభుత్వం గత కొద్ది నెలలుగా చెబుతోంది. ఐపిఒ పరిమాణం రూ.1 లక్ష కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది భారతదేశంలో ఇప్పటివరకు వచ్చిన అన్ని ఇష్యూల కంటే అతిపెద్ద ఐపిఒ కానుంది. ఎల్‌ఐసి ప్రధానంగా పెన్షన్ ప్లాన్‌లు, యాన్యుటీ, హెల్త్ ఇన్సూరెన్స్, యులిప్‌లపై దృష్టిని కేంద్రీకరించింది.
- Advertisement -