Monday, December 23, 2024

నమ్మకానికి ప్రతీక ఎల్ఐసి: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్ధిపేట బ్యాంకు స్ట్రీట్ లో ఎల్ఐసి నూతన భవనం ప్రారంభించిన రాష్ట్ర మంత్రి హరీశ్ రావు

LIC is symbol of trust

సిద్ధిపేట: ప్రజలు నమ్మేది ఒకటే ఎల్ఐసి అని, ఎల్ఐసి అంటే ఒక నమ్మకం, విశ్వాసానికి, విశ్వసనీయతకు మారుపేరు, ఎల్ఐసిని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తామని అనడం చాలా బాధాకరమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట బ్యాంకు స్ట్రీట్ లో భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య ఎల్ఐసి- లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను రాష్ట్ర మంత్రి  హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.

సిద్ధిపేటలో ఎల్ఐసి నూతన బ్రాంచ్ భవనాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. 15 ఏళ్ల నుంచి చేసిన ప్రయత్నం ఇవాళ రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. ఎల్ఐసి ఏజెంట్లకు ఇళ్లు, భవనం ఇచ్చామని, కానీ ఎల్ఐసి భవనం ఆలస్యంగా వచ్చిందని, ఇండియా- ఉమ్మడి రాష్ట్రంలోనే ఏజెంట్లకు మొదటి భవనం ఇచ్చినట్లుగా వివరించారు.

జీవిత భీమా అంటే ఎవ్వరికీ తెలియదనీ, ఎల్ఐసి అంటే అందరికీ తెలుసునని, ఎల్ఐసి ప్రతీ ఒక్కరితో అనుబంధం ఉంటుందని చెప్పుకొచ్చారు. ఎల్ఐసికి అతి పెద్ద కస్టమర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని, లక్షలాది మందికి భీమా చేయించిన ప్రభుత్వం కేవలం తెలంగాణ ప్రభుత్వమని పేర్కొన్నారు. దేశంలోనే అతి పెద్దగా ఎల్ఐసి రైతుభీమా పథకం కింద 1450 కోట్లు ప్రీమియం కడుతున్నట్లు, ఇప్పటికే 81 వేల మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికీ 5 లక్షల చొప్పున బీమా డబ్బులు అందించిందని మంత్రి వెల్లడించారు.

సిద్ధిపేట నియోజకవర్గ ప్రజల కోసం జిందగీకే సాత్ బీ, జిందగీకే బాద్ బీ అంటూ.. మా ప్రజలకు ఎప్పటికప్పుడు కావాల్సిన మౌలిక వసతులు, సదుపాయాలు కల్పిస్తూ.. ఎల్ఐసి స్లోగన్ అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. మంత్రి వెంట మేనేజింగ్ డైరెక్టర్ మినీ ఐపియి, జోనల్ మేనేజర్ జగన్నాథ్, చీఫ్ ఇంజనీర్ వినీత్ వాత్సవ్, రీజనల్ మేనేజర్ మురళీధర్, సికింద్రాబాద్ డివిజన్ మేనేజర్ రామయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News