Thursday, January 23, 2025

ఆసియాలో అతిపెద్ద ఫ్లాప్ స్టాక్‌గా ఎల్‌ఐసి

- Advertisement -
- Advertisement -

LIC is the largest flop stock in Asia

న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసి స్టాక్ క్షీణిస్తూనే ఉంది. స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్ అయినప్పటి నుండి ఎల్‌ఐసి మార్కెట్ విలువ17 బిలియన్ డాలర్లు తగ్గింది. దీంతో ఎల్‌ఐసి ఐపిఒ 2022లో ఆసియాలో అత్యంత అధ్వాన్నమైన ఐపిఒగా నిలిచింది. ఎల్‌ఐసి స్టాక్ ఐపిఒ ధర నుండి 29 శాతానికి పైగా పడిపోయింది. ఎల్‌ఐసి ఐపిఒ ఇష్యూ ధర రూ.949గా ఉంది. సోమవారం ఈ షేరు రూ.669.50 వద్ద ముగిసింది. అంటే దాని ఇష్యూ నుంచి రూ.282 పతనమైంది. ఇన్వెస్టర్లకు రూ.1.64 లక్షల కోట్ల నష్టం రావడంతో ఐపిఒలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు, ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లకు భారీ నష్టాన్ని మిగిల్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News