Monday, December 23, 2024

అదానీ కేసుతో ఎల్ఐసి కి రూ. 8500 కోట్ల నష్టం!

- Advertisement -
- Advertisement -

గౌతమ్ అదానీతో పాటు మరో ఏడుగురిపై అమెరికా ఎఫ్ బిఐ ఆరోపణలు చేసింది. దాంతో అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు పెద్ద ఎత్తున నష్టాలు నమోదు చేశాయి. ఈ నేపథ్యంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసి) గురువారం రూ. 8566 కోట్ల నష్టాలను మూటకట్టుకుంది.  ఎల్ఐసికి ఏడు అదానీ గ్రూప్ కంపెనీల్లో వాటాలు ఉన్నాయి. ఈ వారం ప్రారంభంలో అదానీ స్టాక్స్ లో ఎల్ఐసికి రూ. 54861 కోట్ల విలువైన హోల్డింగ్స్ ఉన్నాయి. ఏసిసి, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అంబుజా సిమెంట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ వంటి కంపెనీల్లో ఎల్ఐసి పెట్టుబడి ఉంది. అదానీ గ్రూప్ కంపెనీలు గురువారం 8 శాతం నుంచి 24 శాతం మేరకు పతనమయ్యాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News