ముంబై: భారతీయ అసెట్ మేనేజ్‌మెంట్ పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన ఫండ్ హౌస్‌లలో ఒకటైన LIC మ్యూచువల్ ఫండ్ (LIC MF), IDBI మ్యూచువల్ ఫండ్ (IDBI MF) పథకాల టేకోవర్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్రకటించింది. ఈ విలీనం జూలై 29, 2023 నుండి అమలులోకి వచ్చింది. LIC MF తన ఉత్పత్తి ఆఫరింగ్ ను బలోపేతం చేయడం, వైవిధ్యపరచడం, తమ కార్యకలాపాలను విస్తరించడం, నిర్వహణలో ఉన్న ఆస్తులను (AUM) పెంచడం ద్వారా దేశంలో ప్రముఖ MF హౌస్‌గా అవతరించడం కోసం LIC MF యొక్క మిషన్‌కు అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టబడింది . జూన్ 30, 2023 నాటికి LIC MF వద్ద రూ.18,400 కోట్ల AUM ఉంది. IDBI MF వద్ద AUM రూ.3,650 కోట్లు ఉన్నాయి.
విలీనం పూర్తయిన తర్వాత, IDBI MF యొక్క 20 స్కీమ్‌లలో, 10 స్కీమ్‌లు LIC MF యొక్క సారూప్య పథకాలతో విలీనం చేయబడతాయి. మిగిలిన 10 LIC MF ద్వారా స్వతంత్ర ప్రాతిపదికన తీసుకోబడతాయి, తద్వారా LIC MF మొత్తం స్కీమ్ కౌంట్ 38కి చేరుకుంటుంది. ఈ విలీనంతో, IDBI MF స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులు ఈక్విటీ, డెట్, హైబ్రిడ్, సొల్యూషన్ ఓరియెంటెడ్ థీమ్‌లు, ETF, ఇండెక్స్ ఫండ్‌లను కవర్ చేసే LICMF యొక్క డైవర్సిఫైడ్ బాస్కెట్ ప్రొడక్ట్ ఆఫర్‌లకు యాక్సెస్ పొందుతారు.
ఈ స్కీమ్‌ల విలీనం విజయవంతంగా పూర్తి కావడంపై ఎల్‌ఐసి మ్యూచువల్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ & సిఇఒ టిఎస్ రామకృష్ణన్ మాట్లాడుతూ “భారతదేశంలోని కీలక మార్కెట్‌లలో పెట్టుబడి అవసరాలను తీర్చడానికి విభిన్నమైన మ్యూచువల్ ఫండ్ హౌస్‌గా సేవలందించేలా మా సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి కృషి చేస్తున్నందున, ఇది మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి. మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్, గోల్డ్ ఫండ్, పాసివ్ ఫండ్ సెగ్మెంట్‌లు మొదలైన వాటిలో మా స్కీమ్ ఆఫర్‌లను విస్తృతం చేయాలనే మా లక్ష్యాన్ని ఈ విలీనం తీర్చనుంది. ఈ విలీనం, విస్తృత శ్రేణి లో మార్కెట్ లో చేరుకునేందుకు తోడ్పడటం తో పాటుగా మరింత విస్తృతమైన ప్రోడక్ట్ బాస్కెట్‌ను అందించడంలో సహాయపడుతుంది. అభివృద్ధి చెందుతున్న అసెట్ మేనేజ్‌మెంట్ పరిశ్రమలో అభివృద్ధి చెందుతున్న అవకాశాలను ఒడిసి పట్టడంలో మరియు పెట్టుబడిదారులు, పంపిణీ భాగస్వాముల కోసం విలువను పెంచడంలో మా సంయుక్త బలం మాకు సహాయపడుతుంది.” అని అన్నారు.
ఆయనే మాట్లాడుతూ.. “సంపద సృష్టిలో విశ్వసనీయ భాగస్వామిగా, మ్యూచువల్ ఫండ్ పరంగా ప్రతి ఒక్కరి ఎంపికగా నిలవాలన్నది మా లక్ష్యం. నిధుల నిర్వహణలో మూడు దశాబ్దాలకు పైగా వున్న మా ట్రాక్ రికార్డు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మేము పొందేలా చేసింది. తగిన రిస్క్ కంట్రోల్ మెకానిజమ్‌లను అవలంబించడం ద్వారా దీర్ఘకాలికంగా మెరుగైన ప్రదర్శన చేయటానికి మీరు మేము దృష్టి కేంద్రీకరించటం తో పాటుగా కృషి చేస్తున్నాము” అని అన్నారు.