ముంబై : దేశీయ అసెట్ మేనేజ్‌మెంట్ పరిశ్రమలో అతిపెద్ద ఫండ్ హౌస్ అయిన ఎల్‌ఐసి మ్యూచువల్ ఫండ్ (ఎల్‌ఐసి ఎంఎఫ్), ఐడిబిఐ మ్యూచువల్ ఫండ్ (ఐడిబిఐ ఎంఎఫ్) పథకాల టేకోవర్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్రకటించింది. ఈ విలీనం జూలై 29 నుండి అమలులోకి వచ్చింది. 2023 జూన్ 30 నాటికి ఎల్‌ఐసి ఎంఎఫ్ వద్ద రూ.18,400 కోట్ల ఎయుఎం ఉంది. ఐడిబిఐ ఎంఎఫ్ వద్ద ఎయుఎం రూ. 3,650 కోట్లు ఉన్నాయి. విలీనం పూర్తయిన తర్వాత ఐడిబిఐ ఎంఎఫ్ 20 స్కీమ్‌లలో 10 స్కీమ్‌లు ఎల్‌ఐసి ఎంఎఫ్ పథకాలతో విలీనం అవుతాయి.
ఈ స్కీమ్‌ల విలీనం విజయవంతంగా పూర్తి కావడంపై ఎల్‌ఐసి మ్యూచువల్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ టి.ఎస్.రామకృష్ణన్ మాట్లాడుతూ, ఇది మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయని అన్నారు. మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్, గోల్ ఫండ్, పాసివ్ ఫండ్ సెగ్మెంట్‌లు మొదలైన వాటిలో మా స్కీమ్ ఆఫర్‌లను విస్తృతం చేయాలనే సంస్థ లక్ష్యాన్ని ఈ విలీనం తీర్చనుందని అన్నారు.