- Advertisement -
ముంబై : ఎల్‌ఐసి మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ కొత్త ఫండ్ ఆఫర్ (ఎన్‌ఎఫ్‌ఒ) ‘ఎల్‌ఐసి ఎంఎఫ్ నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఈటిఎఫ్’ని విడుదల చేసినట్లు ప్రకటించింది. ఈ ఎన్‌ఎఫ్‌ఒ ఫిబ్రవరి 8న ప్రారంభమై ఫిబ్రవరి 12న ముగుస్తుంది. ఎల్‌ఐసి మ్యూచువల్ ఫండ్‌లో ఫండ్ మేనేజర్- ఈక్విటీ సుమిత్ భట్నాగర్ ఈ పథకానికి ఫండ్ మేనేజర్‌గా ఉన్నారు. ఎన్‌ఎఫ్‌ఒలో కనీస పెట్టుబడి రూ. 5000గా నిర్ణయించారు. సంస్థ ఎండి, సిఇఒ రవి కుమార్ ఝా మాట్లాడుతూ, ఎల్‌ఐసి మ్యూచువల్ ఫండ్ ‘ఎల్‌ఐసి ఎంఎఫ్ నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఈటిఎఫ్’ పట్ల ఆశాజనకంగా ఉందన్నారు.
- Advertisement -