Monday, January 20, 2025

హైదరాబాద్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారతదేశం లో విశ్వసనీయ మ్యూచువల్ ఫండ్ హౌస్‌లలో ఒకటైన ఎల్‌ఐసి మ్యూచువల్ ఫండ్, తెలంగాణ రాజధాని నగరమైన హైదరాబాద్‌లో దాని మార్చబడిన కార్యాలయాన్ని 24 జనవరి 2024న ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.

ఈ కార్యాలయాన్ని ఎల్‌ఐసి మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్, అసోసియేట్ డైరెక్టర్, ఆర్.కె. ఝా ప్రారంభించనున్నారు. IT/ITeS నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన, సాంస్కృతికంగా విభిన్నమైన చారిత్రాత్మక నగరంలో కొత్త కార్యాలయం ఉంది. సౌకర్యవంతమైన కస్టమర్ అనుభవాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంది. “పట్టణ వృత్తి నిపుణులు, మధ్యతరగతి పెట్టుబడిదారుల నడుమ ప్రాధాన్య ఆస్తి తరగతుల్లో ఒకటిగా మ్యూచువల్ ఫండ్స్ ఆవిర్భవించడంతో, రాబోయే రోజుల్లో ఈ వర్గాల నుండి మెరుగైన నిధుల ప్రవాహాన్ని మేము ఆశిస్తున్నాము. నిపుణులైన యువత, గణనీయమైన రీతిలో వర్తక కమ్యూనిటీ ని హైదరాబాద్ కలిగి ఉంది. కొనుగోలు శక్తి, మార్కెట్ పెట్టుబడికి అనుబంధం పరంగా అధిక సంభావ్యత, ఎక్కువ ప్రాముఖ్యత కలిగిన నగరం కూడా ఇది. మా కేంద్రీకృత విధానం, మెరుగైన విజిబిలిటీతో, మేము ఈ దక్షిణాది నగరంలో మా విలువైన కస్టమర్‌లకు పెట్టుబడి పథకాలు, నాణ్యమైన సేవలను అందించడానికి ప్రయత్నిస్తున్నాము. మా కొత్త కార్యాలయానికి వారిని స్వాగతిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము” అని ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్, అసోసియేట్ డైరెక్టర్, ఆర్.కె. ఝా అన్నారు.

అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) డేటా ప్రకారం, 31 డిసెంబర్ 2023 నాటికి దేశీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణ కింద ఉన్న ఆస్తులు (AUM) రూ.50.77 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇందులో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కలిపి సగటు AUM రూ. 1.43 లక్షల కోట్లు. ఒక్క రాజధాని నగరంలోనే దాదాపు రూ. 1-లక్ష కోట్ల AUM వున్నాయి. పరిశ్రమ ఆస్తుల పరంగా దేశంలో 8వ అతిపెద్ద నగరంగా ఇది నిలిచింది.

తెలంగాణ ప్రధానంగా ఈక్విటీ-ఫోకస్డ్ మార్కెట్, ఈక్విటీ-టు-నాన్-ఈక్విటీ నిష్పత్తి 70:30గా వుంది. నగర యువ జనాభాతో పాటు సంపన్న వర్తక సంఘం ఉండటం ఫండ్ హౌస్‌లకు నగరంలో తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి పెద్ద అవకాశాన్ని అందిస్తుంది. ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ ప్రాంతీయ మార్కెట్లలో సానుకూలంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం, AUM పరంగా ఫండ్ హౌస్‌లలో 23వ స్థానంలో ఉంది. డిసెంబర్ 2023లో, కంపెనీ సగటు AUM రూ. 27,000 కోట్లు గా వుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News