అక్టోబర్ 21 వరకు పాలసీదారులకు ఎల్‌ఐసి అవకాశం
హైదరాబాద్ : ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించేందుకు గాను పాలసీదారులకు ఎల్‌ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. ఏ కారణం చేతనైనా తమ పాలసీని డిపాజిట్ చేయని వారి పాలసీ లాప్స్ అవుతుంది. అలాంటి వారి పాలసీలను పునరుద్ధరించడానికి ఎల్‌ఐసి ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 21 మధ్య లాప్స్ పాలసీలను మరోసారి యాక్టివేట్ చేసుకోవచ్చు. దీని కింద అన్ని నాన్ -యులిప్ పాలసీలను యాక్టివేట్ చేయవచ్చు, లేట్ ఫీజులో చాలా రాయితీని పొందవచ్చు. ఈ మేరకు ఎల్‌ఐసి ఓ ప్రకటనలో తెలిపింది. ఎల్‌ఐసి పాలసీదారులు తమ లాప్స్ అయిన పాలసీని పునరుద్ధరించుకోవడానికి ఇదొక సదవకాశం అని కంపెనీ తెలిపింది.
5 సంవత్సరాలు దాటొద్దు..
యులిప్ మినహా అన్ని ఇతర పాలసీలను పునరుద్ధరించవచ్చని ఎల్‌ఐసి తెలిపింది. అ యితే పునరుద్ధరించాల్సిన పాలసీలు మొదటి ప్రీమియం బాకీ ఉన్న తేదీ నుంచి 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. మైక్రో ఇ న్సూరెన్స్ పాలసీల పునరుద్ధరణపై లేట్ ఫీ(ఆలస్య రుసుము)లో 100 శాతం తగ్గింపు ఇ వ్వనున్నట్టు తెలిపింది. తక్కువ మొత్తం పాలసీలు మైక్రో ఇన్సూరెన్స్ కింద వస్తాయి.
లక్షలోపు బకాయిలపై 25% రాయితీ
ఎల్‌ఐసి రూ.1 లక్ష వరకు బకాయి ఉన్న ప్రీ మియంపై లేట్ ఫీలో 25 శాతం రాయితీ ఉం టుంది. ఇందులో గరిష్ట రాయితీ రూ.2,500 ఉంటుంది. రూ. 1 నుంచి 3 లక్షల వరకు బ కాయి ఉన్న ప్రీమియంపై గరిష్ట రాయితీ రూ. 3000గా ఉంటుంది. రూ. 3 లక్షలపైన ప్రీమియంపై 30% రాయితీ ఉంటుంది.