Wednesday, January 22, 2025

ఎల్‌ఐసి ఐపిఓలో పాల్గొననున్న కోటిమంది రిటైల్ ఇన్వెస్టర్లు

- Advertisement -
- Advertisement -

LIC will participate in IPO Millions of retail investors

ముంబయి: పాలసీదారులతో పాటుగా దేశంలోని 75 లక్షలనుంచి కోటిమంది దాకా రిటైల్ ఇన్వెస్టర్లు తమ ఐపిఓలోబిడ్‌లు దాఖలు చేస్తారని జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) అంచనా వేస్తోంది. దేశంలోని ఇన్వెస్టర్లలో ఏడో వంతయినా పాల్గొంటారని భావిస్తోంది. దేశ క్యాపిటల్ మార్కెట్స్ చరిత్రలోనే అత్యధికంగా నాన్ ఇన్‌స్టూషనల్ ఇన్వెస్టర్లు పాల్గొనవచ్చని సమాచారం. ఒక్కొక్కరు 30- 40 వేల బిడ్లు దాఖలు చేస్తారని భావిస్తున్నారు. అయితే దీనిపై స్పందించడానికి ఎల్‌ఐసి అందుబాటులోకి రాలేదు. వివిధబ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో డిమ్యాట్ ఖాతాలు 7.38 కోట్లు ఉన్నాయని ప్రభుత్వ అంచనా.

దాదాపు ప్రతి డిమ్యాట్ ఖాతాదారు వద్దకు ఐపిఓను తీసుకు వెళ్లాలని ఎల్‌ఐసి వ్యూహాలను రూపొందిస్తోంది. ఎల్‌ఐసి ఐపిఓ వచ్చే నాటికి దేశంలో డిమ్యాట్ ఖాతాదారుల సంఖ్య 8 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. వచ్చేనెల చివరి నాటికి ఎల్‌ఐసి ఐపిఓ ముగుస్తుంది. దేశమంతా భారీ సంఖ్యలో ప్రజలు చురుగ్గా ఐపిఓలో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు చురుగ్గా ప్రయత్నాలు సాగిస్తున్నారు. గరిష్ఠ స్థాయిలో రిటైల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు, లోకల్ బ్రోకర్లు, ఏజంట్లు ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఎల్‌ఐసికి 13.5 లక్షల మంది ఏజంట్లు ఉన్నారు. 1.14 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News