Monday, December 23, 2024

ఎల్‌ఐసి విలువ రూ.15 లక్షల కోట్లు!

- Advertisement -
- Advertisement -

LIC worth Rs 15 lakh crore

న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) కోసం కసరత్తు వేగంగా జరుగుతోంది. జనవరి చివరి వారంలో కంపెనీ ఈ ఒపిఒ కోసం ప్రాస్పెక్టస్‌ను దరఖాస్తు చేసే అవకాశముంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ప్రభుత్వం ఎల్‌ఐసి విలువను దాదాపు 203 బిలియన్ డాలర్లు (రూ. 15 లక్షల కోట్లు) అంచనా వేయాలని ఒత్తిడి చేస్తోంది. ఎల్‌ఐసి ఎంబెడెడ్ విలువ రూ.4 లక్షల కోట్ల కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎల్‌ఐసి ఐపిఒ కోసం జారీ చేయవలసిన ప్రాస్పెక్టస్‌లో ఈ విలువను చేర్చాలి. ఎల్‌ఐసి అంచనా విలువను నిర్ణయించడానికి సంబంధించిన తుది నివేదిక ఇంకా రావాల్సి ఉంది. స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కంపెనీ రూ. 15 లక్షల కోట్ల విలువతో లిస్ట్ అయితే, అది రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టిసిఎస్)తో సమానమైన విలువ కల్గిన సంస్థగా ఉంటుంది. వాల్యుయేషన్ పరంగా దేశంలో రిలయన్స్, టిసిఎస్ ఈ రెండూ కూడా అతిపెద్ద కంపెనీలుగా ఉన్నాయి. ఈ రెండు కంపెనీల మార్కెట్ విలువలు వరుసగా రూ.17 లక్షల కోట్లు, రూ.14.3 లక్షల కోట్లుగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News