నూతన నిబంధనాలతో డ్రైవింగ్ టెస్ట్ లేకుండా లైసెన్స్
హైదరాబాద్: వాహనాల డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఎదురు చూసే వారికి కేంద్ర ప్రభుత్వం త్వరలో కబరు అందించనుంది. కేంద్రం త్వరలో అమలు చేయనున్న నూతన చట్టం ద్వారా డ్రౌవింగ్ లైసెన్స్‌ల కోసం రోజులు తరబడి ఇటు రవాణాశాఖ కార్యాలయలా చుట్టూ కాని అటు ప్రైవేట్ వ్యక్తులు (ఏజెంట్లు) చుట్టూ ప్రదక్షణలు చేసి వారి పెద్దమొత్తంలో దక్షణలు సమర్పించుకోవాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్ అందించడంలో నూతన విదానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. ఇందుకు సంబంధించిన కొత్త నిబంధనలను జులై 1 నుంచి అమలు చేయనుంది. ఈ నియమాలతో డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్స్ పొందచ్చు. వాహన దారులు రవాణాశాఖ కార్యాయాలక వెళ్ళాల్సిన అవసరం లేదు. కరోనా వైరస్ కారణంగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారిపై ప్రతికూల ప్రభావం పడింది.
దీంతో ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్‌ను పొందాలనుకునేవారు ఆర్‌టివో కార్యాలయాల ముందు లైన్‌లో గంటల కొద్ది నిలబడాల్సిన పనిలేదు.డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ ప్రక్రియకు సంబంధించి కేంద్ర రోడ్డురవాణా రహదారుల మంత్రిత్వ శాఖ డ్రైవింగ్ సెంటరు ్ల(డ్రైవింగ్ స్కూళ్ళు) సెంటర్లకు సంబంధించి కొన్ని రూల్స్‌ను సవరించింది. గుర్తింపు పొందిన డ్రైవింగ్ సెంటర్ల నుంచి డ్రైవింగ్ కోర్సు నేర్చుకునే వారు డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరు కావాల్సిన అవసరం లేదు. గు ర్తింపు పొందిన డ్రైవింగ్ సెంటర్‌లలోనే డ్రైవింగ్ ట్రాక్‌లు ఉంటాయి. డ్రౌవింగ్ నేర్చుకున్న తర్వాత సదరు వాహనాన్ని ఈ ట్రాక్‌లలో నడిపితే సరిపోతుంది. డ్రైవింగ్ టెస్ట్ కోసం రవాణాశాఖ కార్యాలయాల్లోని డ్రౌవింగ్ ట్రాక్‌లకు వెళ్ళాల్సిన పనిలేదు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కేవలం ఐదు డ్రైవింగ్ స్కూళ్ళకు మాత్రమే అనుమతి ఇస్తుంది. అనంతరం వాటిని మళ్ళీ రెన్యువల్ చేసుకోవా ల్సి ఉంటుంది. లైట్ మోటార్ వెహికల్ కోర్సు 4 వారాల్లో 29 గంటలు ఉంటుంది. మీడియం అండ్ హెవీ డ్రౌవింగ్ కోర్సు 6 వారాల్లో 38 గంటలు శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర నూతన చట్టం అమల్లోకి వస్తే లైసెన్స్‌ల కోసం దళారుల చుట్టూ తిరిగి వాళ్ళకు పెద్దమొత్తంలో సమర్పించుకోవాల్సిన అవసరం ఉండదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
License without a driving test with new regulations