Saturday, November 16, 2024

లైసెన్స్ తుపాకులను ఈ నెల 16వ తేదీలోపు స్థానిక పోలీస్ స్టేషన్‌లో డిపాజిట్ చేయాలి

- Advertisement -
- Advertisement -
హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఆదేశాలు జారీ

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగిన వేళ పోలీస్‌శాఖ అప్రమత్తమైంది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో లైసెన్స్ తుపాకులను ఈ నెల 16వ తేదీలోపు స్థానిక పోలీస్ స్టేషన్‌లో డిపాజిట్ చేయాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం డిసెంబర్ 10వ తేదీన వాటిని తిరిగి తీసుకోవచ్చని తెలిపారు. జాతీయ బ్యాంకుల్లో పనిచేసే గార్డులకు, పబ్లిక్ సెక్టార్‌లో విధులు నిర్వర్తించే సెక్యూరిటీ సిబ్బందికి మాత్రం మినహాయింపునిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పడు లైసెన్స్ ఉన్న తుపాకీలను స్థానిక పోలీస్ స్టేషన్‌కు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని సివి ఆనంద్ వెల్లడించారు. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎస్‌ఇసి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఇసి సన్నాహాలు చేస్తోంది. వివిధ పార్టీలతో ఇప్పటికే సమావేశమైన ఎన్నికల ప్రధానాధికారి వారికి పలు సూచనలు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీల, నేతల పోస్టర్లను అధికారులు తొలగిస్తున్నారు. ప్రభుత్వం ఎటువంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి అవకాశం లేదని ఇసి ఆదేశాలు జారీ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News