Wednesday, January 22, 2025

అదానీ స్టాక్స్‌లో రూ. 50వేల కోట్లు తగ్గిన ఎల్‌ఐసి పెట్టుబడి విలువ!

- Advertisement -
- Advertisement -
ఎల్‌ఐసి ఇప్పుడు ప్రతికూల విలువ లేదా నష్టాన్ని మూటగట్టుకుంది.

ముంబై: అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసి ఫిబ్రవరి 23న నష్టాలను మూటగట్టుకుంది. అదానీ స్టాక్‌లకు ఇప్పుడు మద్దతు లభించడంలేదు. అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువ 80 శాతం మేరకు పతనమయ్యాయి. ఇక ఆ గ్రూప్ కంపెనీలు నష్టాల్లోకి వెళతాయేమో. ఈ ఏడాది(2023) మొదలు నుంచి ఆ గ్రూపు కంపెనీల కంబైన్డ్ లాభం రూ. 53000 కోట్ల లాభాల నుంచి రూ. 3000కు పడిపోయింది. వాస్తవానికి హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడిన నాటి నుంచే అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పతనమవుతూ వస్తున్నాయి.

అదానీ గ్రూప్‌లో ఎల్‌ఐసి పెట్టుబడి ఫిబ్రవరి 23 నాటికి రూ. 33000 కోట్లుగా ఉంది. 2022 డిసెంబర్ 31 న అది రూ. 83000 కోట్లుగా ఉండింది. జనవరి 24న హిండెన్‌బర్గ్ నివేదికను ప్రచురించినప్పుడు అదానీ కంపెనీల్లో ఎల్‌ఐసి వాటా రూ. 81000కోట్లుగా ఉండింది. అమ్మకాల ఒత్తిడి కారణంగానే అదానీ గ్రూప్ స్టాక్‌లు పడిపోయాయి. హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడ్డాక జనవరి 30న అదానీ గ్రూప్ ఈక్విటీల్లో ఎల్‌ఐసి వాటా రూ. 35917 కోట్లు అని ప్రకటించింది. అకౌటింగ్ మోసాలు, స్టాక్ మ్యానిపులేషన్ వంటి అవకతవకలకు అదానీ గ్రూప్ పాల్పడిందని అమెరికాలోని షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ పేర్కొంది. దాంతో అదానీ గ్రూప్‌కు చెందిన కంపెనీల 146 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ లేక దాదాపు 60 శాతం పతనమైంది. నాడు అదానీ గ్రూప్ తమపై వచ్చిన అన్ని ఆరోపణలను కొట్టిపారేసింది. గురువారం అదానీ షేర్ల విలువ పతనం కావడంతో ఎల్‌ఐసి పెట్టుబడి ఇప్పుడు నష్టాల్లోకి జారుకుంది.

బహిరంగంగా ట్రేడయ్యే ఏడు అదానీ కంపెనీలలో ఎల్‌ఐసికి 1.28 శాతం నుంచి 9.14 శాతం వరకు వాటాలున్నాయి. అదానీ పోర్ట్‌లో ఎల్‌ఐసికి 9 శాతం కంటే ఎక్కువ వాటా ఉంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో ఎల్‌ఐసికి 4.23 శాతం వాటా ఉంది. అదానీ టోటల్ గ్యాస్‌లో 6 శాతం వరకు వాటా ఉంది. అదానీ ట్రాన్స్‌మిషన్‌లో 3.65 శాతం వాటా, అదానీ గ్రీన్‌లో 1.28 శాతం వాటా ఉంది. కాగా ఏసిసి, అంబుజా సిమెంట్ కంపెనీల్లో ఎల్‌ఐసి పెట్టిన పెట్టుబడి నష్టాలు అంత తీవ్రంగా లేవు. అదానీ గ్రూప్ కంపెనీల్లో ఎల్‌ఐసి ఎక్స్‌పోజర్ బుక్‌వ్యాల్యూ నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులలో (ఏయూఎం) 0.975 శాతమేనని ఎల్‌ఐసి సమర్థించుకుంటోంది.

అదానీ గ్రూప్ కంపెలు గురువారం గణనీయంగా నష్టపోయాయి. నెల రోజుల్లోనే అదానీ గ్రూప్ మార్కెట్ మూలధనం దాదాపు రూ. 12 లక్షల కోట్లు హరించుకుపోయింది. బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్ ప్రకారం ఇప్పుడు అదానీ సంపద 42.7 బిలియన్ అమెరికన్ డాలర్లు. ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన స్థానం 29వ స్థానంలో ఉంది. గత ఏడాది రెండో స్థానంలో ఆయన ప్రకాశించారు. అహ్మదాబాద్‌కు చెందిన అదానీ గ్రూప్ కంపెనీలు మౌలికవసతులు, కామడిటీస్, విద్యుత్ ఉత్పత్తి, ట్రాన్స్‌మిషన్, రియల్ ఎస్టేట్, సిమెంట్ తదితరాలలో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News