Sunday, December 22, 2024

ధరణిపై దగాకోరు ప్రచారం !

- Advertisement -
- Advertisement -

బంగాళాఖాతంలో వేసేది ధరణినా.. రైతులనా?

ఎన్నిసార్లు అడిగినా కాంగ్రెస్ దగ్గర సమాధానం లేదు

వాళ్లకు ఎద్దు, ఎవుసం తెల్వదు సీతారామ ప్రాజెక్ట్ పూర్తయితే ఉమ్మడి ఖమ్మం సస్యశ్యామలం

16వేల కుటుంబాలకు పోడు పట్టాలిచ్చిన ఘనత మాదే

24గంటల కరెంటు కావాలా.. మూడు గంటలా?

దమ్మపేట, బూర్గంపాడు ప్రజా ఆశీర్వాద సభల్లో బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్

మన తెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం/బూర్గంపాడు/అశ్వారావుపేట: ప్రజాస్వామ్య పరిణితి చెందిన దేశాలు ఎంతగానో అభివృద్ధి చెందుతున్నాయని, అటువంటి పరిస్థితి మన దేశంలో కూడా రావాలని అప్పుడే భారతదేశం బాగుపడుతుందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సు డిగాలి పర్యటన చేస్తున్న ఆయన సోమవారం పినపాక నియోజకవర్గ పరిధిలోని లక్ష్మీపురం గ్రామం, దమ్మపేటతో పాటు బూర్గంపాడులో భద్రాచలం, పినపాక నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ జిల్లాలకు చెందిన భట్టి విక్రమార్కతో పాటు రాహుల్‌గాంధీ, పిసిసి అధ్యక్షుడు ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని, అది అసలు అవసరమే లేదని చెబుతున్నారు. మళ్లీ విఆర్‌ఒలు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, ఎంఆర్‌ఒలు వస్తే మీ భూములపై పెత్తనం వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుందని కెసిఆర్ హెచ్చరించారు.

ధరణిని తీసేస్తే రైతుబంధు, బీమా డబ్బులు ఖాతాల్లోకి ఎట్లా వస్తాయని ప్రశ్నించారు. ధరణిపై మీ విధానం ఏంటో చెప్పాలని నిలదీశారు. ఎన్నిసార్లు అడిగినా సమాధానం రావడం లేదని దుయ్యబట్టారు. ‘అసలు కాంగ్రెస్ నాయకులకు వ్యవసాయం గురించి ఏ పాటి జ్ఞానం ఉందో, రైతుల గురించి ఏపాటి అవగాహన ఉందో తెలియనకనే ధరణిని తీసేస్తామని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘రైతుబంధు డబ్బులు హైదరాబాద్ లో విడుదల చేస్తే సెల్‌ఫోన్లు మోగుతున్నయ్. ఆ డబ్బులను మీ ఇష్టంగా పెట్టుబడికి వాడుకుంటున్నరు. మంచి పంటలు పండిస్తున్నరు. పంటల డ బ్బులు వస్తున్నయ్. ఎవరైనా చనిపోతే బీమా డబ్బు లు పైరవీలు లేకుండా వస్తున్నయ్. మరి ధరణిని తీసివేస్తే ఇవన్నీ ఎలా వస్తాయి అన్నారు.’ అభ్యర్థుల గుణగణాలు, వారి వెనుక ఉన్న పార్టీల వైఖ రి, నడవడిక, సత్ప్రవర్తన ఆధారంగా ఓటు హక్కు నియోగించుకోవాలని సూచించారు. తమా షా కో సం పోలింగ్ కేంద్రానికి వెళ్తే మీ బతుకులు ఆగమైపోతాయని, ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలు మీ తలరాతలు మార్చే ఆయుధాలు కావాలని ఉద్భోదించారు. మోసపోతే గోస పడతారని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మునుపు, ఈ పదేళ్లలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకుని తమ కోసం ఆలోచించే పార్టీని గెలిపించాలని కోరారు.
రాహుల్ ఎన్నడన్న పొలం దున్నిండా?
కాంగ్రెస్ నేతలు చాలా తీవ్రమైన మాట మాట్లాడుతున్నారు. వాళ్లకు దేవుడు ఏం బుర్ర ఇచ్చిండో ఎం త బుర్ర ఉన్నదో తెలియదు కానీ.. కేసీఆర్ 24గంటల కరెంటు వేస్ట్‌గా ఇస్తున్నడని అంటున్నరు. ‘రాహుల్ గాంధీకి ఎద్దు ఎరుకనా.. వ్యవసాయం ఎరుకనా.? ఎన్నడన్న పొలం దున్నిండా? వ్యవసాయా నికి 3 గంటల కరెంటు సరిపోతుందటా? మూడు గంటలు ఇస్తే ఒక మడి కూడా తడుస్తుందా? మూ డు గంటల్లో నీళ్లు పారాలంటే 10 హెచ్‌పీ మోటర్ పెట్టుకోవాలటా.. రైతు 10హెచ్‌పీ మోటర్ పెట్టుకుంటడా? మనం పెట్టుకునేది మూడు,ఐదు హెచ్ పీ మోటర్ వాడేది. పది హెచ్‌పీ మోటర్ కాంగ్రెసో డు కొనిస్తడా? మళ్లీ గ్యారంటీగా తప్పిపోయి గెలి స్తే గోల్‌మాల్ చేస్తామని ఓపెన్‌గా చెబుతున్నరు. మరి వాళ్లను గోల్‌మాల్ చేద్దామా? మనం అవుదామా? ఆలోచన చేయాల్సింది మీరు’నన్నారు.

పట్టణాలకు దీటుగా మంచినీరు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన, దళిత ప్రజలు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతమని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో విటిపిఎస్ మాదిరిగా ఇక్కడ కూడా భద్రాద్రి పవర్ ప్లాంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి వేలాది మం ది తెలంగాణ బిడ్డలకు ఉపాధి కల్పించడమే కాకుం డా రాష్ట్రానికి వెలుగులు అందించే ప్రాజెక్టును ని ర్మించామని వివరించారు. గతంలో ఆంధ్రోళ్లు ఈ పరిశ్రమను కూడా తమ ప్రాంతానికి తీసుకు వెళ్లేందుకు కుట్రలు పన్నారని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో మన్యం ప్రాంతం జ్వరాలతో తల్లడిల్లే ప రిస్థితి నుంచి నేడు అధునాతన ఆసుపత్రులను అం దుబాటులోకి తీసుకువచ్చి స్థానికంగానే కార్పొరేట్ వైద్యం అందిస్తూ ఎందరో గిరిజన బిడ్డల ప్రాణాలు కాపాడామని గుర్తు చేశారు. మంచినీటి కోసం గో సపడ్డ ఆడబిడ్డల మనోవేదనను అర్థం చేసుకుని మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేసి నేడు పట్టణాలకు దీటుగా గ్రామ గ్రామాన, పల్లెలు, గిరిజన గూడాలకు కూడా స్వచ్ఛమైన మంచినీరు అందిస్తున్నామని పేర్కొన్నారు.

వ్యవసాయ స్థిరీకరణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టామని, దీని ఫలితంగా నేడు దేశం లో తెలంగాణ అద్భుతమైన పంటలకు ప్రసిద్ధి చెం దిందని అన్నారు. రైతు బంధు, రైతు భీమా ప్రపంచంలో ఎక్కడ అమలు కావడం లేదని ఇది తన మదినుంచి వచ్చిన ఆలోచనగా అభివర్ణించారు. ప్రతిపక్షాలు వ్యవసాయానికి మూడు గంటలు మా త్రమే కరెంటు ఇస్తామని ప్రకటిస్తున్నాయని, 24 గంటలు విద్యుత్ సరఫరా చేసే ప్రభుత్వం కావా లా.. కాంగ్రెస్, బిజెపి నాయకులు చెపుతున్న విధం గా 3, 4, గంటలు ఇచ్చే వారు కావాలా… అని ప్రజలను అడిగారు. దీంతో సభకు పెద్ద ఎత్తున వచ్చి న ప్రజలు తమకు బిఆర్‌ఎస్ ప్రభుత్వమే కావాలని నినాదాలు చేశారు.

ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూములు సురక్షితంగా రైతుల యాజమా న్య హక్కులతో భద్రంగా ఉన్నాయని వారి బయోమెట్రిక్ (వేలి ముద్రలు) లేనిదే మార్చే ప్రసక్తి లే కుండా పకడ్భందీగా రూపొందించామని చెప్పా రు. ఇంత మంచి వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో కలుపుతామని చెపుతుందని, దీనిని మీరు అంగీకరిస్తారా అని ప్రజలను ఉద్దేశించి అ న్నారు. రైతుబంధును కూడా ఆపాలని చూస్తున్నారని ఇది ఎంత దుర్మార్గమో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాగానే ఏకంగా రూ. 12వేల రూపాయలకు పెం చుతామని జనం హర్షద్వానాల మధ్య ప్రకటించారు. ఆసరా పింఛన్లు కూడా దశల వారీగా పెం చుతూ వస్తున్నామని మరోసారి అధికారం ఇస్తే ఐదు వేలకు పెంచి విధి వంచితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

16వేల కుటుంబాలకు 57వేల ఎకరాల పోడు పట్టాలు
పినపాక నియోజకవర్గంలో పోడు సాగుదారులు ఎక్కువగా ఉన్నారని యాజమాన్యపు హక్కులు లేక పోవడంతో ఫారెస్ట్ అధికారుల నుంచి వేధింపులు ఎక్కువగా ఉండేవని ఈ సమస్య పరిష్కారం కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేసిందని చెప్పా రు. 16వేల కుటుంబాలకు 57వేల ఎకరాలు పం చి పోడు పట్టాలు అందించడమే కాకుండా వారికి రైతుబంధు కూడా అమలు చేస్తున్నామని ఓ దఫా వారి బ్యాంకుల్లో నగదు జమ అయ్యిందని వివరించారు. మారుమూల ప్రాంతాల్లో ప్రసవాలకు గర్భిణులు ఎన్ని అవస్థలు పడేవారో పేపర్లలో చూశామని, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా వాగులపై బ్రిడ్జీలు నిర్మించి సురక్షితంగా దవాఖానాలకు తీసుకువస్తూ కెసిఆర్ కిట్ అమలు చేస్తున్నామని అన్నారు. కరకట్ట మీదుగా గోదావరి ప్రమాదకరంగా ప్రవహిస్తున్న సమయంలో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని నదికి ఇరువైపులా కరకట్టను నిర్మిస్తామని, సీతారాముల వారి దర్శనం చేసుకుని స్వయంగా నేనే ప్రారంభిస్తానని సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.

ఆడపిల్ల జన్మిస్తే 13 వేలు, మగబిడ్డకు 12 వేలు ఇస్తున్నామని గుర్తు చేశారు. ఇంత అభివృద్ధి చేస్తున్న తమపై ప్రతిపక్షాలు అవాకులు చెవాకులు పేలుస్తూ ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బిఆర్‌ఎస్ అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని ప్రగల్భాలు పలుకుతున్న వారికి గట్టి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. తమకు ఓట్లు వేసేది ప్రజలని వారే తమకు హై కమాండ్ అని వేస్ట్‌గాళ్లను పట్టించుకోబోమని చురకలు అంటించారు. పినపాక, భద్రాచలం నియోజకవర్గాలను పైలెట్ ప్రాజెక్టులుగా ప్రకటించి అర్హులైన ప్రతీ దళి త బిడ్డకు ఒకే దఫా పథకం అమలు చేస్త్తామని ప్రకటించారు. బిఆర్‌ఎస్ అభ్యర్థులు రేగా కాంతారా వు, తెల్లం వెంకట్రావు, మెచ్చ నాగేశ్వరరావులను గెలిపించే బాధ్యత మీరు తీసుకుంటే మీ అభివృద్ధి బాధ్యత నేను చూసుకుంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపిలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, ఎంఎల్‌ఎలు వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, బానోత్ హరిప్రియ, ఎంఎల్‌సి తాతా మధుతో పాటు బిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

బిఆర్‌ఎస్‌లో చేరిన నియోజకవర్గ నేతలు..
ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ వేదికపై నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల కీలక నాయకులు కెసిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారిలో అశ్వారావుపేట మాజీ ఎంఎల్‌ఎ తాటి వెంకటేశ్వర్లు, ములకలపల్లి జట్పిటిసి సు న్నం నాగమణి, అశ్వారావుపేట మాజీ ఎంఎల్‌ఎ దివంగత నేత వగ్గేల మిత్రసేన మనుమరాలు వగ్గే ల పూజిత, వైఎస్సార్ టిపి జిల్లా అధ్యక్షులు సో యం వీరభద్రం కెసిఆర్ సమక్షంలో పార్టీలో చేరా రు. అంతకు ముందు అదే వేదికపై ఎంపి నామ నాగేశ్వరరావు సమక్షంలో బిజెపి నాయకులు భూక్యాప్రసాద్, బాణోతు పద్మావతి, చండ్రుగొండ జట్పిటిసి కొనగళ్ళ వెంకటరెడ్డి నాయకులు బీఆర్‌ఎస్ కండువాలు కప్పుకున్నారు. కార్యక్రమంలో ఎంపి నామ నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు డా. బండి పార్థసారథిరెడ్డి, ఎంఎల్‌సి తాత మధు, రాష్ట్ర నాయకులు మధుసూదనాచారి, బొంతు రా మ్మోహన్, నియోజకవర్గ బిఆర్‌ఎస్ పార్టీ ఇంఛార్జి ఉప్పల వెంకట రమణ, జట్పిటిసిలు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News