Wednesday, January 22, 2025

అబద్ధాలతో చరిత్ర మారదు

- Advertisement -
- Advertisement -

రాజకీయ వేదికలపై నుంచి ‘అసత్యాల వెల్లువ’
బిజెజిపై రాహుల్ విమర్శ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ మేనిఫెస్టోపై ‘ముస్లిం లీగ్ ముద్ర’ ఉందని బిజెపి పదే పదే ఆరోపిస్తుండడంతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. దేశాన్ని విభజించాలని చూసిన శక్తులతో ఎవరు చేతులు కలిపారో చరిత్ర సాక్షిగా ఉందని ఆయన అన్నారు. రాజకీయ వేదికలపై నుంచి ‘అబద్ధాలు వల్లె వేయడం’ ద్వారా చరిత్ర మారదని రాహుల్ స్పష్టం చేశారు.

2024 లోక్‌సభ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య పోరు అని, భారత్‌ను సదా సంఘటితం చేసిన కాంగ్రెస్ ఒక వైపు ఉందని, దేశాన్ని విభజించే యత్నం చేసినవారు రెండవ వైపు ఉన్నారని ఆయన ‘హిందీలో ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. దేశాన్ని విభజించాలని కోరుకున్న శక్తులతో చేతులు కలిపి, వారికి బలం ఇచ్చినది ఎవరో, దేశ సమైక్యత, స్వాతంత్య్రం కోసం పోరాడింది ఎవరో చెప్పేందుకు చరిత్ర సాక్షి అని రాహుల్ పేర్కొన్నారు.

“క్విట్ ఇండియా ఉద్యమం’సమయంలో బ్రిటిష్ వారి పక్కన ఎవరు నిలబడ్డారు? భారతీయ జైళ్లు కాంగ్రెస్ నాయకులతో నిండిపోయినప్పుడు దేశాన్ని విభజించిన శక్తులతో రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఎవరు నడిపారు?’ అని ఆయన అడిగారు. రాజకీయ వేదికలపై నుంచి ‘అసత్యాలు వల్లె వేయడం’ ద్వారా చరిత్ర మారదని రాహుల్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News