Sunday, November 17, 2024

రాజకీయం లబ్ధి కోసమే తిరుమల లడ్డూపై అబద్ధాలు: జగన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: శ్రీవారి ప్రసాదాల్లో వాడని నెయ్యిని వాడినట్టు ఎందుకు అంటున్నారని సిఎం జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. జంతువుల కొవ్వు వాడారని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఆడుతున్నారని, గుజరాత్ నుంచి వచ్చిన నివేదికను టిడిపి కార్యాలయం విడుదల చేసిందని మండిపడ్డారు. తిరుమల పర్యటన రద్దుపై జగన్ మీడియాతో మాట్లాడారు. ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని వాడలేదని టిటిడి ఇఒ మళ్లీ చెప్పారని, సెప్టెంబరు 22న టిటిడి ఇఒ ప్రభుత్వానికి లేఖ పంపారని, రహస్య నివేదిక అయితే టిడిపి ఆఫీసు నుంచి ఎలా బయటకు వస్తుందని అడిగారు. టిటిడి ఇఒ పలుమార్లు చెప్పినా వినకుండా సిఎం చంద్రబాబు మళ్లీ అబద్ధాలు చెప్పారని జగన్ దుయ్యబట్టారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకే ఇలా అబద్ధాలు ఆడుతున్నారని, తిరుమల ప్రసాదాలపై ఇలా దుష్ప్రచారం చేయడం అపవిత్రత కాదా? అని ధ్వజమెత్తారు. ఆవులు వెజిటేబుల్స్ ఆయిల్స్ తిన్నా ఇలాంటి ఫలితాలు వస్తాయని చెప్పిందని, ఈ విషయాలన్నీ నివేదిక డిస్‌క్లయిమర్స్‌లో రాశారని జగన్ మోహన్ స్పష్టం చేశారు.

తిరుమల ప్రసాదాలపై అనుమానాలు రేకెత్తించడం దుర్మార్గం కాదా?, రాజకీయ స్వార్థం కోసం శ్రీవారి ప్రసాదాలు విశిష్టతను దెబ్బతీస్తున్నారని, 2015 నుంచి 2018 వరకు టెండర్ల ప్రక్రియలో నందిని బ్రాండ్ ఎందుకు లేదని ప్రశ్నించారు. గతంలో కొన్నప్పుడు ఉండే క్వాలిటీ ఇప్పుడూ కూడా ఉందన్నారు. 2019లో కూడా టిడిపి హయాంలో రూ.324 కు నెయ్యి కొన్నారని గుర్తు చేశారు. మతం పేరుతో రాజకీయాలు చేయడం దుర్మార్గమైన చర్య అని అభివర్ణించారు. ఎన్‌డిఎ కూటమిలోని చంద్రబాబు లడ్డూ విశిష్టతను కించపరుస్తుంటే బిజెపి ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. చంద్రబాబు చెప్పు చేతల్లో ఉండే అధికారులతో సిట్ వేశారని జగన్ మోహన్ మండిపడ్డారు. బయటకు వెళ్తే అన్ని మతాలను గౌరవిస్తానని, హిందూమత ఆచారాలను పాటిస్తానని, తన కులం, మతం ఏంటో ప్రజలందరికీ తెలుసునన్నారు. తన మతం మానవత్వం అని, నాలుగు గోడల మధ్య మాత్రమే తాను బైబిల్ చదువుతానన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News