Sunday, December 22, 2024

‘ఎఫ్ 3’ పార్టీ సాంగ్ ప్రోమో విడుదల..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విక్టరీ వెంకటేశ్, మెగా‌ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కించిన కామెడీ ఎంటర్ టైనర్ చిత్రం ‘ఎఫ్ 3’. ఇందులో తమన్నా, మెహ్రీన్ కథానాయికలుగా నటిస్తుండగా.. సునీల్, మురళీ శర్మ, సోనాల్ చౌహన్, అలీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలకు కూడా మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ సినిమాలోని పార్టీ సాంగ్ ప్రోమో ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పార్టీ సాంగ్ లో వెంకీ, వరుణ్ లతో పూజా హెగ్డే ఆడిపాడింది. ఈ ప్రోమోతో పాటపై అంచనాలను పెంచేశారు మేకర్స్. రేపు పూర్తి సాంగ్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక, మే 27న ప్రపంచ వ్యాప్తంగా ఎఫ్ 3 చిత్రం థియేటర్స్‌లో నవ్వుల సందడి చేయబోతోంది.

LIfe Ante Itla Vundaalaa Song Promo out from F3 Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News