Saturday, September 14, 2024

జాతి వ్యతిరేక పోస్టులకు యావజ్జీవ కారాగారం

- Advertisement -
- Advertisement -

యుపి ప్రభుత్వ కొత్త డిజిటల్ పాలసీ

లక్నో: రాష్ట్రంలో సోషల్ మీడియా పాలసీలో భారీ మార్పులను యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఈ పాలసీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యుట్యూబ్‌తోసహా సోషల్ మీడియా వేదికలన్నిటికీ వర్తిస్తుంది. కొత్త పాలసీ ప్రకారం అభ్యంతరకర కంటెంట్‌ను పోస్టు చేస్తే కఠినమైన శిక్షలు ఉండడంతోపాటు ఇన్‌ఫ్యూయెన్సర్లకు భారీ ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి. జాతి వ్యతిరేక కంటెంట్‌ను పోస్టు చేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. గతంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఊటి) యాక్ట్‌కు చెందిన 6ఇ, 66ఎఫ్ కింద ప్రభుత్వం చర్యలు తీసుకునేంది.

మూడేళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్షను విధించే విధంగా కొత్త పాలసీని ప్రభుత్వం రూపొందించింది. రాష్ట్ర సమాచార శాఖ రూపొందించిన ఉత్తర్ ప్రదేశ్ డిజిటిల్ మీడియా పాలసీ, 2024ను యుపి క్యాబినెట్ మంగళవారం ఆమోదించింది. కొత్త పాలసీ ప్రకారం అశ్లీల లేదా కించపరిచే విధంగా ఆన్‌లైన్‌లో కంటెంట్‌ను పోస్టు చేస్తే నేరపూరిత పరువునష్టం కేసులు నమోదవుతాయి. డిజిటల్ ప్లాట్‌ఫారాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం వి ఫార్మ్ పేరిట డిటిజిటల్ ఏజెన్సీని సృష్టించనున్నది. డిజిటల్ ప్లాట్‌ఫారాలపై వచ్చే ప్రకటనలతోపాటు వీడియోలు, ట్వీట్లు, పోస్టులు, రీల్స్‌ను కూడా ఇది పర్యవేక్షిస్తుంది. వీటితోపాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల ఇన్‌ఫ్యూయెన్సర్లు, అకౌంట్ హోల్డర్లు, ఆపరేటర్లకు నిర్దిష్టమైన చెల్లింపుల పరిమితులను కొత్త పాలసీ విధించింది.

ఎక్స్‌కు సంబంధించి గరిష్ఠంగా నెలకు రూ. 8 లక్షలు, ఫేస్‌బుక్‌కు రూ. 4లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌కు రూ. 3లక్షల చెల్లింపుల పరిమితిని ప్రభుత్వం విధించింది. యుట్యూబ్‌కు సంబంధించి వీడియోలకు నెలకు రూ. 8 లక్షలు, షార్ట్‌కు రూ. 7 లక్షలు, పాడ్‌కాస్ట్‌లకు రూ. 7 లక్షల చెల్లింపు పరిమితిని విధించింది. కొత్త డిజిల్ మీడియా పాలసీకి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందని రాష్ట్ర మంత్రి అనిత్ రాజ్‌భర్ తెలిపారు. జాతి వ్యతిరేక కంటెంట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలలో పోస్టు చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని ఆయన తెలిపారు. కొత్త పాలసీ నిరుద్యోగ సమస్యకు కూడా ఒక పరిష్కారాన్ని చూపిందని ఆయన చెప్పారు. నిరుద్యోగులకు ఇది మంచి అవకాశమని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News