Monday, January 20, 2025

సంగారెడ్డి లావణ్య హత్య కేసులో ప్రియుడికి జీవిత ఖైదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురంలో లావణ్య అనే యువతిని హత్యచేసి సూట్ కేసులో పెట్టి కాలువలో వేసిన ప్రియుడికి జీవిత ఖైదును కోర్టు విధించింది. బీహార్ రాష్ట్రానికి చెందిన మనోజ్ షా కుటుంబం చాలా ఏళ్ల క్రితం హైద్రాబాద్‌కు వలస వచ్చింది. నగరంలోని సూరారం కాలనీలో నివాసం ఉంటుంది. మనోజ్ షా కొడుకు సునీల్ మేడ్చల్ జిల్లాలోని ఇంజనీరింగ్ చదువుకున్నాడు. సమయంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీనివాసరావు కూతురు లావణ్యతో సునీల్‌కు పరిచయమేర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. వీరిద్దరి చదువులు పూర్తయ్యాయి. అయినా కూడా వీరి మధ్య బంధం ఆగిపోలేదు. పెళ్లి చేసుకుంటానని సునీల్ లావణ్యను లోబర్చుకున్నాడు. అయితే పెళ్లి చేసుకోవాలని లావణ్య ఒత్తిడి పెంచడంతో ఆమెను పథకం ప్రకారం సునీల్ కుమార్ హత్య చేశాడు.

2019 ఏప్రిల్ 4వ తేదీన ఉద్యోగం కోసం మస్కట్ కు వెళ్తున్నట్టుగా లావణ్యను ఆమె తల్లిదండ్రులను సునీల్ కుమార్ నమ్మించాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో తాము వెళ్లాల్సిన ఫ్లైట్ మిస్ అయిందని సునీల్ కుమార్ లావణ్యను నమ్మించాడు. అదే రోజు రాత్రి శంషాబాద్ లాడ్జీలో గడిపారు. అయితే పెళ్లి విషయమై లావణ్య సునీల్‌ను నిలదీసింది. దీంతో సునీల్ ఆమెను హతమార్చాడు. లావణ్య తీసుకు వచ్చిన ట్రావెల్ బ్యాగులోనే ఆమె డెడ్ బాడీని పెట్టాడు. సూరారం వచ్చే దారిలోని నాలాలో సూట్ కేసును గిరాటేశాడు. అయితే మస్కట్ నుండి ఇంటికి వస్తున్నట్టుగా లావణ్య ఫోన్ నుండి మేసేజ్ పెట్టాడు. అయినా ఆమె రాలేదు. దీంతో పేరేంట్స్ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఫోన్ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు విచారణ నిర్వహిస్తే లావణ్య హత్య విషయం వెలుగులోకి వచ్చింది. సునీల్ కుమార్ లావణ్యను హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. నాలా నుండి లావణ్య డెడ్ బాడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసుకు సంబంధించి సోమవారం కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ప్రియుడు సునీల్ కుమార్‌కు జీవిత ఖైదును విధించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News