హైదరాబాద్ : అటవీ అధికారిపై దాడి చేసి, హతమార్చిన గుత్తికోయలకు సరైన శిక్ష పడిందని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చలమల శ్రీనివాసరావును హత్య చేసిన నిందితులకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించటాన్ని అటవీశాఖ ఉద్యోగ సంఘాలు ఆహ్వానించాయి. ఎఫ్‌ఆర్‌ఓ కుటుంబాన్ని ఆదుకోవటంతో పాటు, దోషులకు వేగంగా శిక్ష పడేలా చేసిన ప్రభుత్వ యంత్రాంగానికి, ముఖ్యమంత్రి కెసిఆర్,మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి అటవీశాఖ తరపున ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలను తెలిపారు. వేగవంతమైన విచారణకు సహకరించిన భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీతో పాటు, పోలీసులను అటవీశాఖ ఉద్యోగ సంఘాలు ప్రత్యేకంగా ప్రశంసించాయి.
తీర్పుతో సిబ్బందిలో మనోధైర్యం..
ఏడు నెలల్లో న్యాయస్థానం తీర్పు వెల్లడించడాన్ని ఆహ్వానిస్తున్నామని రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం. డోబ్రియాల్ అన్నారు. అటవీ రక్షణ ఉన్న అధికారులు, సిబ్బందికి తాజా తీర్పు మనోధైర్యాన్ని ఇస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ – తెలంగాణ చాప్టర్, రాష్ట్ర అటవీ అధికారుల సంఘం, అటవీ క్షేత్రాధికారుల సంఘం, జూనియర్ ఫారెస్ట్ అధికారుల సంఘం ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలను తెలియజేశాయి.
దోషులకు జీవిత ఖైదు హర్షణీయం: అటవీశాఖ ఉద్యోగులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -