Thursday, November 14, 2024

సోదరుడిని హత్య చేసిన కేసులో జీవితఖైదు

- Advertisement -
- Advertisement -

Life imprisonment in murder case of brother

మనతెలంగాణ, సిటిబ్యూరో: సోదరుడిని హత్య చేసిన కేసులో నిందితుడికి మల్కాజ్‌గిరి కోర్టు జీవిత ఖైదు శిక్ష, రూ.1,000 జరిమానా విధించారు. పోలీసుల కథనం ప్రకారం….మల్కాజ్‌గిరి, ఇందిరా నగర్‌కు చెందిన ఆర్. ఆంజనేయులు పెయింటింగ్ పనిచేస్తున్నాడు. తన సోదరుడు నర్సింగ్ కూడా పెయింటింగ్ పనిచేస్తున్నాడు. ఇద్దరు పక్కపక్కనే ఉంటున్నారు. ఇరు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓ రోజు బాధితుడు ఆంజనేయులు, నర్సింగ్ మధ్య గొడవ జరిగింది. తర్వాత ఆంజనేయులు తన బావమరిదిని తీసుకుని నర్సింగ్ ఇంటికి వెళ్లాడు. దీంతో ఇంటిలో నుంచి బయటికి వెళ్లాల్సిందిగా నర్సింగ్ కోరాడు. కొద్ది రోజుల తర్వాత ఆంజనేయులు తన ఇంటిని విక్రయానికి పెట్టాడు, తన కూతురు వివాహం కోసం అమ్ముతున్నానని చెప్పాడు.

దీంతో ఆగ్రహం చెందిన నర్సింగ్ ఆంజనేయులును చంపివేయాలని ప్లాన్ వేశాడు. సెప్టెంబర్ 18వ తేదీన నిందితుడు, బాధితుడు ఆంజనేయులు కలిసి మధ్యం తాగారు, ఇంటికి వచ్చి తర్వాత వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఇదివరకే ప్లాన్ వేసుకున్న నర్సింగ్ ఇంట్లో నుంచి కొడవలి తీసుకుని వచ్చి ఆంజేయులు ముఖం, మెడపై దాడి చేయడంతో స్పృహ కోల్పోయాడు. కేకలు విన్న చుట్టుపక్కల వారు వచ్చి వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సెప్టెంబర్19వ తేదీన మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న మల్కాజ్‌గిరి పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కోర్టులో సాక్షాలు ప్రవేశపెట్టడంతో కోర్టు నిందితుడికి జైలు శిక్ష విధించింది. నిందితుడికి శిక్షపడేలా చేసిన ఇన్స్‌స్పెక్టర్ జగదీశ్వర్, సిడిఓ జంగయ్య, ఎపిపి గంగారెడ్డి, ఎపిపి నారాయణను రాచకొండ పోలీస్ కమిషనర్ అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News