Sunday, January 19, 2025

భర్తను హత్య చేసిన భార్యకు జీవిత ఖైదు

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట : భర్తను హత్య చేసిన కేసులో భార్యకు జీవిత ఖైదు విధించిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ వర్మ కథనం ప్రకారం… ముహమ్మద్ సోహెల్ (30), రేష్మా (25) బేగంలు భార్యాభర్తలు. ఇరువురు పలు ప్రాంతాలలో తిరుగుతూ భిక్షాటన చేసి జీవనం సాగించేవారు. ఫుట్‌పాతులు, దుకాణాల ముందు గల చబుత్రాలపై నిద్రించేవారు. భర్త వేధింపులు భరించలేక ఒక రోజు రాత్రి రేష్మా అతనిని హత్య చేసింది.

చాంద్రాయణగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలోని ఒక దుకాణం ముందు సోహెల్ అనుమానాస్పదస్థితిలో చనిపోయి ఉన్నాడన్న సమాచారం మేరకు అప్పటి ఇన్‌స్పెక్టర్, ప్రస్తుత చార్మినార్ ఏసీపీ రుద్ర భాస్కర్, సిబ్బంది రేష్మాను అదుపులోకి తీసుకొని మృతుడు సోహెల్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.పోలీసులు రేష్మాను విచారించగా అమె సమాధానాలు చెప్పటంలో తడబడింది. అతరువాత అసలు విషయం వెల్లడించింది. దీంతో పోలీసు ఆమెపై కేసు నమోదు చేశారు. కేసు పూర్వాపరాలను విచారించిన నాంపల్లి కోర్టు బుధవారం తుది తీర్పు ఇచ్చింది.

నిందితురాలు రేష్మాకు జీవిత ఖైదు, 500 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చింది. ఈ కేసులో చురుకుగా వ్యవహరించి, కోర్టుకు తగిన ఆధారాలు సమర్పించి నిందితురాలికి శిక్షపడేలా కృషి చేసిన ఏసీపీ రుద్ర భాస్కర్, ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ వర్మ, కోర్టు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News