- Advertisement -
కల్వకుర్తి: జీవిత భీమా సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది తమ హక్కుల సాధన కోసం బుధవారం జీవిత భీమా కార్యాలయం వద్ద భోజన విరామం సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిబ్బంది సంఘం కార్యదర్శి లక్ష్మణ చారి మాట్లాడుతూ కుటుంబ పెన్షన్ 15శాతం నుంచి 30 శాతం పెంచాలని, వేతన సవరణపై స్పష్టత లేదని దానిపై స్పందించాలని డిమాండ్ చేశారు. నూతన రిక్రూట్మెంట్ చేపట్టాలని, యువతకు ప్రొత్సాహం అందించాలని కోరారు. సెప్టెంబర్ 12న తలపెట్టిన రెండు గంటల సమ్మెకు స్నేహంగా బుధవారం, సెప్టెంబర్ 8, 11న భోజన విరామ సమయాలలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్‌ఐసి శాఖ అధ్యక్ష, కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు
- Advertisement -