Monday, December 23, 2024

పంచాయతీ కార్మికులకు జీవిత బీమా

- Advertisement -
- Advertisement -

ప్రీమియం చెల్లింపు బాధ్యత పంచాయతీలదే…

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ప నిచేస్తున్న 55వేల మంది మల్టీపర్పస్ కార్మికులకు జీవిత బీమా పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిం ది. ఈ పథకంలో నమోదైన కార్మికుడు ఎవరైనా మరణిస్తే రూ.5 లక్షలు జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) ద్వారా సాయం రూపంలో అందుతుంది. పంచాయతీల అభివృద్ధికి సేవలందిస్తున్న కార్మికుల కుటుంబాలకు సామాజిక భద్రత కింద ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం పేర్కొంది. కార్మికులకు సంబంధించి ప్రీమియం సంబంధిత గ్రామ పంచాయతీలు చెల్లించనున్నాయి. అన్ని పంచాయతీలు కార్మికుల ప్రీమియం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశిం చింది. బీమా పథకంలో చేర్చడానికి కార్మికులు, వారి నామినీల పేర్లు, తదితర సమాచారంతో వెంటనే నివేదిక పంపించాలని సూచించింది. అదే విధంగా గ్రామ పంచాయతీ కార్మికులు ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల కోసం ప్రస్తుతం రూ.5 వేలు చెల్లిస్తున్నారు. దానిని రూ.10 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులను గ్రామపంచాయతీలే భరించాలని సూచించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News