Sunday, December 22, 2024

షేక్ జుబేర్ హత్య కేసులో ఇరువురికి జీవిత కాల శిక్ష

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ క్రైం : నగరంలోని ధర్మపురి హిల్స్‌కు చెందిన షేక్ జుబేర్‌ను హత్య చేసిన నిందితులు ఫరీద్ అలియాస్ అబ్బాస్, సులేమాన్ ఖాన్‌లకు మంగళవారం నిజామాబాద్ సెషన్స్ న్యాయమూర్తి సునీత కుంచాల జీవిత కారాగార శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. ధర్మపురి హిల్స్‌లో నివాసముండే ఫరీద్, జుబేర్ సారంగపూర్‌లోని ఇజాజ్ బీరువాల దుకాణంలో కార్మికులుగా పని చేసే వారు. అక్కడ జుబేర్ చీటికి మాటికి తనను అవమానించేవాడని, సెల్‌ఫోన్ దొంగలించాడని ప్రచారం చేసి తనను మరింత అవమానించారని ఫరీద్, జుబేర్ పై కక్ష పెంచుకున్నాడు. ఈమేరకు 28 జులై 2019న ఫోన్ ద్వారా ధర్మపురి హిల్స్ అటవీ ప్రాంతంలోకి జుబేర్‌ను పిలిపించి ఫరీద్ తన స్నేహితుడైన సులేమాన్ ఖాన్‌తో కలిసి సెల్‌ఫోన్ లాక్కుని జుబేర్ తలపై వెనక నుండి బండరాళ్లు తలపై వేసి అతి కిరాతకంగా హతమార్చారు. నిజామాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ పంపారు. ఈకేసులో నిందితులపై అభియోగాలు రుడి అయినందున షేక్ ఫరీద్ అలియాస్ అబ్బాస్, సులేమాన్ ఖాన్‌లకు జీవిత కాల కారాగార శిక్ష 2000 రూపాయల జరిమానా, జరిమానా కట్టని యెడల మరో ఆరు నెలల శిక్షణను విధిస్తూ నిజామాబాద్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సునీత కుంచాల తుది తీర్పును వెలువరించారు. గత కొంత కాలంగా దోషులకు కఠిన శిక్షలు పడుతుండటంతో జిల్లా ప్రజలలో న్యాయ వ్యవస్థ పై నమ్మకం పెరుగుతుందని పలువురు చర్చించుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News