Tuesday, January 21, 2025

భార్యను హత్య చేసిన వ్యక్తికి జీవితఖైదు

- Advertisement -
- Advertisement -

భార్యపై దాడి చేసి మృతికి కారణమైన వ్యక్తికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ శుక్రవారం ఎల్‌బి నగర్‌లోని మూడవ ఏడి న్యాయమూర్తి తీర్పు చెప్పారు. రంగారెడ్డి జిల్లా, సరూర్‌నగర్ మండలం, నందవనానికి చెందిన చిట్టోళ్ల వీరయ్య అలియాస్ వీరప్ప కూలీ పనిచేస్తున్నాడు. తాగుడుకు బానిసగా మారడంతో తరచూ భార్యభర్త మధ్య గొడవ జరుగుతుండేది. ఈ క్రమంలోనే వీరయ్య తాగివచ్చి భార్య మీద దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలు కావడంతో బాధితురాలు మృతిచెందింది. మీర్‌పేట పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి 302,498 ఐపిసి కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. సాక్షాలు సేకరించి కోర్టులో ప్రవేశ పెట్టగా పరిశీలించిన కోర్టు నిందితుడికి జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News