మనతెలంగాణ/హైదరాబాద్: 12 మంది బాలికలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితులు రమావత్ హరీష్ నాయక్, శ్రీనివాసరావులకు గురువారం నల్గొండ జిల్లా పొక్సో కోర్టు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానా విధించింది. అదేవిధంగా ఈ కేసులో నిందితులు అత్యాచారానికి సహకరించిన నిర్వాహకురాలు సరితకు 6నెలల జైలు శిక్ష జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..నల్లగొండ జిల్లా పెద్దవూర ఏనమిది తండాకు చెందిన (విఆర్‌వొ) విలేజ్ రీకన్స్ట్రక్షన్ అర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సంస్థ హస్టల్ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈక్రమంలో 2014 జనవరి 3వ తేదీన నిందితుడు రమావత్ హరీష్ నాయక్ 12 మంది బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ప్రతి రోజు ఒకరి చొప్పున అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధిత విద్యార్థినిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జిల్లా మొదటి అదనపు సెషన్ పోక్సో కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడు రమావత్ హరీష్ నాయక్ సహా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు శ్రీనివాస్ రావు, సరితలను కూడా దోషులుగా కోర్టు నిర్దారించింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో దోషులు పై కోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం కల్పించింది.
Life Sentenced to 2 men for Raping Minor