Sunday, January 19, 2025

శ్రీలక్ష్మికి జీవన సాఫల్య పురస్కారం

- Advertisement -
- Advertisement -

విష్ణు బొప్పన వీబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ 2023–2024 సంవత్సరాలకు గాను బుల్లి తెర అవార్డులని ప్రదానం చేసింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో ఎస్‌వి కృష్ణా రెడ్డి, కె.అచ్చి రెడ్డి, అంబికా కృష్ణ. జేడీ లక్ష్మి నారాయణ, పూరి ఆకాష్, అర్చన ముఖ్య అతిథులుగా పాల్గొనగా వర్చ్యుసా లైఫ్ స్పేసెస్ వైగండ్ల వెంకటేశ్వర్లు , వీవీకే హోసింగ్ ప్రై.లి. విజయ్ కుమార్, ఐశ్వర్య సిల్క్ లక్ష్మి, అడ్వకేట్ నాగేశ్వర్ రావు పూజారి సమర్పకులుగా ఉన్నారు. ఈ వేడుకలో సీనియర్ నటి శ్రీలక్ష్మికి జీవన సాఫల్య పురస్కారం అందించారు.

మానస, వేద, బిగ్ బాస్ ఫేమ్ బేబక్క, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్, దివ్యవాణి, రీతూ చౌదరి, బులెట్ భాస్కర్, రామ సత్యనారాయణ, మాణిక్యం, మాదాల రవికి ఈ సందర్భంగా అవార్డులను అందజేశారు. అంతే కాకుండా టీవీ ఆర్టిస్టులు, యూట్యూబర్స్‌కి కూడా అవార్డులను ప్రదానం చేశారు. పది మంది పేద కళాకారులకి ఆర్ధిక సాయం కూడా అందించారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఇన్నేళ్ళుగా సినిమాల్లో నటిస్తున్న నన్ను గుర్తించి నాకు ఈ అవార్డుని అందజేయడం ఆనందంగా ఉందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News