Saturday, December 21, 2024

అక్రమ కేసులు ఎత్తివేయాలి : తమ్మినేని వీరభద్రం

- Advertisement -
పేదలు, మహిళలను వెంటనే విడుదల చేయాలి

- Advertisement -

హైదరాబాద్ : హయత్‌నగర్ మండలం సాయబ్‌నగర్‌లో ప్రభుత్వ భూమిలో ఇంటిస్థలం కోసం పోరాడుతున్న పేదలపై పోలీ సులు విచక్షణారహితంగా లాఠీఛార్జి చేయడంతో పాటు అరెస్టు చేసి అర్థరాత్రి జైలుకు పంపడాన్ని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్రంగా ఖండించారు. వెంటనే వారందరినీ బేషరతుగా విడుదల చేయాలని కోరారు. సాయబ్‌నగర్ సర్వే నెం.71లో ఉన్న 26 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఇండ్లస్థలాలు ఇప్పించాలని కోరుతూ తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో సుమారు 2000 మంది పేదలు ఉద్యమిం చారని తెలిపారు. జానెడు స్థలం కోసం పోరాడుతున్న పేదలపై స్థానిక సిఐ ఆధ్వర్యంలో పోలీసులు లాఠీఛార్జి చేసి ప్రజాసంఘాల నేతలు, ఆందోళనకారులను అరెస్టు చేశారన్నారు. వీరిపై కేసు నమోదు చేసి అర్ధరాత్రి జడ్జిముందు ప్రవేశపెట్టి జైలుకు పంపారని తెలిపారు. వీరిలో సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్ర మోహన్, సిపిఐ(ఎం) స్థానిక నాయకులు గణేష్ గౌడ్, 9 మంది మహిళలతో కలిపి మొత్తం 19మంది ఉన్నారన్నారు.

అంతటితో ఆగకుండా ఆ ప్రాంతంలోని దళితవాడ మీద కూడా దాడి చేసి స్థానికులతో పాటు మహిళలను తీవ్రంగా గాయపర్చారని తెలిపారు. రాజు అనే వ్యక్తి చేయి విరిగి ఆస్పత్రి పాలయ్యాడని తెలిపారు. ఒకవైపు వేల ఎకరాల ప్రభుత్వ భూములు రియల్ వ్యాపారుల ఆక్రమణకు గురవుతుండగా, 60 గజాల ఇంటి స్థలం కోసం పోరాడుతున్న పేదలపై అధికారులు, పోలీసులు దౌర్జన్యం చేయడం అత్యంత దారుణం. ప్రభుత్వం ఈవిధంగా ఉద్యమాలను అణచివేయాలని చూడటం అప్రజాస్వామికమని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేదలకు స్థలం కేటాయించి, గృహ నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఇవ్వాలని, లేనట్టయితే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు.. భూపోరాటంలో పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, దళితులు, మహిళల మీద దాడి చేసిన సిఐని సస్పెండ్ చేయాలని, ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నదన్నారు.. ప్రజాసంఘాల బస్సుజాతాను అడ్డుకోవడం అత్యంత దుర్మార్గమన్నారు.
అరెస్టు చేసినవారిని వెంటనే విడుదల చేయాలి
ప్రజాసంఘాల పోరాటవేదిక ఆధ్వర్యంలో పేదలందరికీ ఇండ్లు, ఇండ్లస్థలాలు ఇవ్వాలనే డిమాండ్‌తో మహబూబాబాద్‌లో ప్రారంభమైన బస్సుయాత్రను పోలీసులు అడ్డుకుని ఆపాలని చూడటాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. నాయకులు పాదయాత్రగా వెళ్ళి భూపోరాట కేంద్రాన్ని సందర్శిస్తున్న సమయంలో జాతాబస్సు డ్రైవర్‌ను కొట్టి, డ్రైవర్‌తో పాటు బస్సును పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్ళడం, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరాంనాయక్‌ను అరెస్టు చేయడం అత్యంత దారుణం. వీరిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బస్సును బృందానికి అప్పగించాలని కోరుతున్నామని, ప్రజాస్వామ్యయుతంగా సాగుతున్న యాత్రను అడ్డుకోవాలని చూస్తే ప్రజాగ్రహం చవి చూడక తప్పదని హెచ్చరించారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News